Sound Alert System: కేంద్రం సంచలన నిర్ణయం.. ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ ఉండాల్సిందే!
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- ఈవీ వెహికిల్స్ కి సౌండ్ తప్పనిసరి చేసిన కేంద్రం..
- 2027 అక్టోబర్ 1 వరకు అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు AVAS..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sound Alert System: సాధారణంగా వాహనాలు రోడ్లపై ప్రయాణిస్తుంటే ఇంజిన్ శబ్దం వలన హారన్ కొట్టకపోయినా గుర్తించడం ఈజీ. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీ, మోటార్ ఆధారంగా నడవడంతో శబ్దం రాదు. ఫలితంగా వెనక నుంచి వెహికిల్స్ వస్తున్నా పాదచారులు లేదా ఇతర వాహనదారులు గుర్తించడం చాలా కష్టం అవుతుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు వెహికల్ అలర్ట్ సిస్టంను తప్పనిసరి చేసింది.
Read Also: Traffic Challan : చెప్పులు వేసుకొని బైక్ నడిపితే జరిమానా..?
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
ఇక, 2027 అక్టోబర్ 1వ తేదీ నుంచి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు వెహికల్ అలర్ట్ సిస్టమ్ అమర్చడం తప్పనిసరి కానుంది. రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ పేర్కొనింది. 2026 అక్టోబర్ 1వ తేదీ తర్వాత తయారయ్యే అన్ని కొత్త ఎలక్ట్రిక్ ప్యాసింజర్, గూడ్స్ వాహనాలు AVAS సౌకర్యంతోనే రోడ్లపైకి రావాలని మంత్రిత్వశాఖ రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా, వాహనాలు కదిలే సమయంలో ఈ సిస్టమ్ కృత్రిమ శబ్దాన్ని విడుదల చేస్తుంది. దీని వలన పాదచారులు, రోడ్డుపై ఉన్న ఇతర ప్రయాణికులు వాహనం వస్తోందని ముందుగానే గుర్తించే అవకాశం ఉంది. ఏఐఎస్-173 ప్రమాణాల ప్రకారం శబ్ద స్థాయిలతో ఈ సౌండ్ సిస్టమ్ ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతం అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాలు ఇప్పటికే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు AVAS వినియోగాన్ని తప్పనిసరి చేశాయి. అలాగే, భారత్‌లో కూడా ఈ నిబంధన అమల్లోకి రానుంది.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!