Speed Post New Rates: తపాలా శాఖ కీలక ప్రకటన.. స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త ధరలు.. లేఖలు, పార్శిల్స్ పై కొత్త నిబంధనలు
- స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త ధరలు
- ప్రస్తుతం 6 ప్రధాన నగరాల్లో మాత్రమే
- లేఖలు, పార్శిల్స్ పై కొత్త నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ సేవలను వినియోగించే వినియోగదారులకు భారత తపాలా శాఖ (India Post) కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చేలా ’24 స్పీడ్ పోస్ట్’, ’48 స్పీడ్ పోస్ట్’ సేవలకు కొత్త రేట్లను విడుదల చేసింది. అంతేకాకుండా, ఏ వస్తువులను ‘లేఖలు’ (Letters)గా, ఏవాటిని ‘పార్శిల్’ (Parcels)గా పరిగణిస్తారో కూడా స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించింది.
లేఖలుగా పరిగణించే వస్తువులు
అన్ని రకాల ఉత్తరాలు, ముద్రిత పత్రాలు, తిరిగి అమ్మే విలువ లేని బహుమతి వస్తువులు.
స్వాగత కిట్లు, పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వంటి బ్యాంకింగ్, ఆర్థిక సేవలకు సంబంధించిన పత్రాలు.
పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు.
గరిష్టంగా 500 గ్రాముల వరకు ఉన్న రాఖీ కవర్లు, గ్రీటింగ్ కార్డులు (వాణిజ్య విక్రయాల కోసం పంపనివి).
Also Read
- Rule Changes from August 1: ఆగస్టు 1 నుంచి రానున్న కొత్త రూల్స్ ఇవే.. LPG ధరల నుంచి తత్కాల్ రైలు టికెట్ల వరకు
- Indane Xtralite Now: ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ ప్రారంభం.. తేలికైన LPG సిలిండర్, 4 గంటల్లో హోమ్ డెలివరీ.. బుకింగ్ ఇలా..
- CXMT: ఈ IPO కొన్నవాళ్లకు పండగే పండగ.. లిస్టింగ్‌తోనే లక్షల్లో లాభాలు!
- రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
పార్శిల్ గా పరిగణించే వస్తువులు
లేఖల విభాగంలోకి రాని అన్ని రకాల వస్తువులు, వాణిజ్య ఉత్పత్తులు మరియు వ్యాపార సరుకులు పార్శిల్ విభాగంలోకి వస్తాయని తపాలా శాఖ స్పష్టం చేసింది.
కొత్త స్పీడ్ పోస్ట్ రేట్లు
రిటైల్ కస్టమర్ల కోసం
24 స్పీడ్ పోస్ట్
బరువు, దూరాన్ని బట్టి ఒక్కో వస్తువుకు రూ. 38 నుంచి రూ. 186 వరకు.
50 గ్రాముల వరకు:
స్థానిక డెలివరీ – రూ. 38
దేశవ్యాప్తంగా – రూ. 94 (జీఎస్టీ అదనం)
51-250 గ్రాములు – రూ. 118 నుంచి రూ. 154 వరకు.
251-500 గ్రాములు – రూ. 140 నుంచి రూ. 186 వరకు.
48 స్పీడ్ పోస్ట్
బరువు, దూరాన్ని బట్టి రూ. 61 నుంచి రూ. 121 వరకు.
టోకు (బల్క్) వినియోగదారులకు
ఉత్తరాల విభాగంలో బల్క్ బుకింగ్‌ల కోసం ప్రత్యేక ధరలను ప్రకటించారు.
24 స్పీడ్ పోస్ట్: ఒక్కో వస్తువుకు రూ. 38 నుంచి రూ. 100 వరకు.
48 స్పీడ్ పోస్ట్: ఒక్కో వస్తువుకు రూ. 48 నుంచి రూ. 72 వరకు.
ప్రస్తుతం 6 ప్రధాన నగరాల్లో మాత్రమే
’24 స్పీడ్ పోస్ట్’, ’48 స్పీడ్ పోస్ట్’ ప్రత్యేక సేవలు ప్రస్తుతం దేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల ద్వారా వరుసగా 24 గంటలు మరియు 48 గంటల్లోపు పార్సెల్లు, పత్రాల డెలివరీని తపాలా శాఖ అందిస్తోంది.
వినియోగదారులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
కొత్త రేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో, స్పీడ్ పోస్ట్ ద్వారా వస్తువులు పంపే ముందు అవి లేఖల కేటగిరిలోకి వస్తాయా లేదా పార్శిల్ కేటగిరిలోకి వస్తాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవడం మంచిది. ముఖ్యంగా బల్క్ బుకింగ్‌లు చేసే సంస్థలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు కొత్త ధరలను పరిశీలించి సేవలను వినియోగించుకోవాలని తపాలా శాఖ సూచించింది.
తాజావార్తలు
-
Speed Post New Rates: తపాలా శాఖ కీలక ప్రకటన.. స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త ధరలు.. లేఖలు, పార్శిల్స్ పై కొత్త నిబంధనలు
-
Vaibhav Sooryavanshi-BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. బీసీసీఐకి పెద్ద తలనొప్పి!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన ‘మొఘల్-ఎ-ఆజమ్’ పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
ట్రెండింగ్
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!