Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
- చైనాకు భారత్ గట్టి షాక్
- అల్యూమినియం ఫాయిల్‌పై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు
- 'మేక్ ఇన్ ఇండియా'కు బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా నుంచి చౌకగా దిగుమతి అవుతున్న అల్యూమినియం ఫాయిల్‌పై భారత ప్రభుత్వం మరోసారి కఠిన వైఖరిని ప్రదర్శించింది. దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, చైనా, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం ఫాయిల్‌పై విధిస్తున్న యాంటీ-డంపింగ్ సుంకాన్ని 2026 డిసెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం దేశీయ అల్యూమినియం తయారీ సంస్థలకు పెద్ద ఊరటనివ్వగా, చైనాకు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆర్థిక మంత్రిత్వ శాఖ 2026 జూన్ 10న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2021 సెప్టెంబర్ 16న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. 51/2021-కస్టమ్స్ (ADD) ను సవరిస్తూ ఈ పొడిగింపును అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న యాంటీ-డంపింగ్ సుంకాన్ని ముందుగానే ఉపసంహరించుకోకపోతే లేదా సవరించకపోతే, అది 2026 డిసెంబర్ 15 వరకు కొనసాగుతుంది.
Also Read
- Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
- LIC Investment: ఎల్ఐసీ మీ పాలసీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతుంది? నష్టాలను ఎలా ఎదుర్కొంటుంది? పూర్తి వివరాలు
- Gold Price Today: శ్రావణ మాసం వేళ గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఢమాల్.. 24K, 22K రేట్లు ఇవే
- BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
ఏ దేశాల నుంచి దిగుమతులపై ఈ సుంకం?
ఈ నిర్ణయం చైనా, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ నాలుగు దేశాల నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం ఫాయిల్‌కు వర్తిస్తుంది. ఈ దేశాల నుంచి దిగుమతి అయ్యే 80 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ మందం ఉన్న అల్యూమినియం ఫాయిల్ పై యాంటీ-డంపింగ్ సుంకం అమలులో ఉంటుంది.
DGTR సన్‌సెట్ రివ్యూ కొనసాగుతోంది
చౌక దిగుమతుల ప్రభావంపై దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) 2025 సెప్టెంబర్ 29న సన్‌సెట్ రివ్యూను ప్రారంభించింది. ఈ సమీక్ష ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. ప్రస్తుతం అమలులో ఉన్న సుంకాన్ని తొలగిస్తే దేశీయ పరిశ్రమ మరోసారి నష్టపోయే ప్రమాదం ఉందా అనే అంశాన్ని పరిశీలించడం. సమీక్ష ప్రక్రియలో భాగంగా, 2026 ఏప్రిల్ 28న విచారణ నిర్వహించగా, పరిశ్రమ ప్రతినిధులు, దిగుమతిదారులు, ఇతర వాటాదారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
దేశీయ కంపెనీల డిమాండ్ ఇదే
భారతీయ తయారీ సంస్థలు చౌక దిగుమతుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయని వాదించాయి. ముఖ్యంగా హిండాల్కో ఇండస్ట్రీస్ (Hindalco Industries), SRF Altech వంటి సంస్థలు యాంటీ-డంపింగ్ సుంకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరాయి. విదేశాల నుంచి తక్కువ ధరలకు వస్తున్న అల్యూమినియం ఫాయిల్ కారణంగా దేశీయ ఉత్పత్తిదారులు పోటీలో వెనుకబడుతున్నారని, స్థానిక పరిశ్రమల మనుగడకు ముప్పు ఏర్పడుతోందని అవి పేర్కొన్నాయి.
యాంటీ-డంపింగ్ సుంకం అంటే ఏమిటి?
ఒక దేశం తన ఉత్పత్తులను మరో దేశంలో అసాధారణంగా తక్కువ ధరలకు విక్రయించడం ద్వారా అక్కడి స్థానిక పరిశ్రమలను దెబ్బతీసే పరిస్థితిని ‘డంపింగ్’ అంటారు. ఇలాంటి అన్ ఫెయిర్ పోటీని అరికట్టేందుకు దిగుమతి ఉత్పత్తులపై అదనపు పన్ను విధించడాన్ని యాంటీ-డంపింగ్ సుంకంగా పిలుస్తారు. దీని ద్వారా దేశీయ తయారీదారులకు రక్షణ లభిస్తుంది.
‘మేక్ ఇన్ ఇండియా’కు బలం
ప్రభుత్వ తాజా నిర్ణయం దేశీయ అల్యూమినియం పరిశ్రమకు మద్దతుగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, చౌక దిగుమతులను నియంత్రించడం ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరింత బలం చేకూరనుంది. అంతేకాకుండా, విదేశీ కంపెనీల అన్ ఫెయిర్ ధరల వ్యూహాల నుంచి భారతీయ పరిశ్రమలను రక్షించేందుకు ఇది కీలక చర్యగా పరిగణిస్తున్నారు.
తాజావార్తలు
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
IND vs SL: తొలి టెస్టు టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్.. సీనియర్‌కు నో ప్లేస్, కొత్త కుర్రాడు అరంగేట్రం!
-
Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Karur Stampede: ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక తీర్పు.. కరూర్ బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
ట్రెండింగ్
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్‌కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!