Coca‑Cola Price: యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న కోకా కోలా ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో కోకా కోలా ఉత్పత్తులను బాటిలింగ్ చేసే ప్రధాన సంస్థ ఎస్ఎల్ఎంజీ బేవరేజెస్ త్వరలో కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉందని సమాచారం. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్యాకేజింగ్ ఖర్చులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. కంపెనీ డిప్యూటీ సీఈఓ రాహుల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉత్పత్తి ఖర్చులు ఒత్తిడిలో ఉన్నాయని తెలిపారు. యుద్ధం కొనసాగితే ప్లాస్టిక్ బాటిల్స్, మూతలు, లేబుల్స్, కార్డ్బోర్డ్ బాక్సుల వంటి ప్యాకేజింగ్ వస్తువుల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే ధరలు పెంచాలా లేదా అనేది మార్కెట్ పరిస్థితులు.. ఇతర కంపెనీల నిర్ణయాలు, వినియోగదారుల స్పందనపై ఆధారపడి ఉంటుంది.
ఇప్పటికే కొన్ని నీటి బాటిల్ కంపెనీలు ధరలను పెంచాయి. కానీ భారతదేశంలో శీతల పానీయాల మార్కెట్ చాలా పోటీగా ఉండటంతో ధరలు పెంచడం అంత సులభం కాదు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ కాంపా కూలాను మార్కెట్లోకి తీసుకురావడంతో పోటీ మరింత పెరిగింది. గత 7-8 సంవత్సరాల్లో కంపెనీ పెద్దగా ధరలు పెంచలేదని రాహుల్ కుమార్ తెలిపారు. అయితే ఏప్రిల్‌లో ధరలపై సమీక్ష జరగనుంది. ఇప్పటికీ ఖర్చులు పెరుగుతున్నా, భవిష్యత్తుపై కంపెనీకి నమ్మకం ఉంది. భారత్‌లో శీతల పానీయాల మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో వేగంగా పెరుగుతుందని అంచనా. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ కొత్తగా నాలుగు ఫ్యాక్టరీలను నిర్మించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది.
Also Read
- Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
- EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
Also Read:Rangareddy: చనిపోయిన తల్లిపై పడి ఏడ్చి.. నిస్సహాయంగా కుప్పకూలిన చిన్నారి..
ఇటీవల కంపెనీ ఆదాయం, లాభాలు కూడా గణనీయంగా పెరిగాయి. రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించి మరింత వృద్ధిని సాధించాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!