CCTV Ban: కీలక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం.. ఆ సీసీటీవీలు బంద్.. ఏప్రిల్ 1 నుంచి అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనీస్ సీసీటీవీ కెమెరాలపై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత దృష్ట్యా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ‘మేడ్ ఇన్ చైనా’ కెమెరాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించబోతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో హెక్ విషన్ (Hikvision), దాహువా (Dahua), టీపీ-లింక్ (TP-Link) వంటి చైనా కంపెనీల హవా నడుస్తోంది. అయితే.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త సర్టిఫికేషన్ నిబంధనల ప్రకారం.. ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యే ఈ చైనా కంపెనీల నిఘా పరికరాల అమ్మకాలను భారత్‌లో నిలిపివేయనున్నారు. ముఖ్యంగా ‘స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్’ (STQC) అనుమతి ఉన్న కెమెరాలను మాత్రమే ఇకపై దేశంలో విక్రయించాల్సి ఉంటుంది.
ఎందుకు ఈ నిషేధం..?
Also Read
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
నిఘా పరికరాలు అత్యంత సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తాయి. విమానాశ్రయాలు, ప్రభుత్వ భవనాలు, రవాణా కేంద్రాలు వంటి కీలక ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ క్రమంలో చైనా కెమెరాల ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భారత భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ కెమెరాల్లో రహస్యంగా ‘బ్యాక్ డోర్’ యాక్సెస్ ఉండే అవకాశం ఉందని, దీని ద్వారా సేకరించిన సమాచారం విదేశీ సర్వర్‌లకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్షణ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో చైనా కెమెరాలను వాడటం వల్ల మన వ్యూహాత్మక సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సర్వైలెన్స్ మార్కెట్‌లలో ఒకటి. తాజా నిర్ణయం వల్ల చైనా కంపెనీలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉండగా.. భారతీయ తయారీదారులకు ఇది పెద్ద అవకాశంగా మారనుంది. తద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ పెరగనుంది. మొత్తానికి.. డేటా భద్రతే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ , రక్షణ రంగాల్లో పెను మార్పులకు దారితీయనుంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!