Income Tax: భారత్‌లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Income Tax: భారత్‌లో కుబేరుల సంఖ్య రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని వెల్లడించిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య అసెస్మెంట్ ఇయర్ (AY) 2025-26 నాటికి ఏకంగా 576కు చేరింది. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన అధికారిక గణాంకాల ద్వారా ఈ విషయం బయటపడింది. గతేడాది ఈ సంఖ్య 415గా ఉండేది. దేశంలో శతకోటీశ్వరుల సంఖ్య పెరుగుతోందా అని అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఐదేళ్ల క్రితం (AY 2021-22) లో రూ. 100 కోట్ల కంటే ఎక్కువ రాబడిని చూపించిన వారు కేవలం 142 మంది మాత్రమే ఉండేవారని, ఈ లెక్కన చూస్తే గడిచిన ఐదేళ్లలో దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఏకంగా 300 శాతానికి పైగా పెరిగిందని తెలిపారు.
ఈ ఐదేళ్ల కాలంలో AY 2021-22లో 142గా ఉన్న ఈ సంఖ్య, AY 2022-23 నాటికి 301కి చేరి, AY 2023-24లో కొద్దిగా తగ్గి 284కు పడిపోయింది. ఆ తర్వాత AY 2024-25లో 415కు పెరిగి, AY 2025-26లో ఏకంగా 576కి చేరింది. అయితే, పార్లమెంట్లో బిలియనీర్లు అనే పదాన్ని ప్రస్తావించినప్పటికీ.. ప్రభుత్వం వద్ద ‘బిలియనీర్’ అనే పదానికి ఎలాంటి అధికారిక లేదా చట్టబద్ధమైన నిర్వచనం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 లేదా పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 పరిధిలో దీనికి నిర్వచనం లేకపోవడంతో రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఐటీఆర్ దాఖలు చేసిన ప్రాతిపదికనే వీరిని అత్యధిక ఆదాయ వర్గాలుగా పరిగణించినట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే, 2016 ఏప్రిల్ 1 నుంచి ‘వెల్త్-ట్యాక్స్ యాక్ట్, 1957’ రద్దయినందున, పన్ను చెల్లింపుదారుల మొత్తం సంపదకు సంబంధించిన లెక్కలను ప్రభుత్వం నిర్వహించడం లేదని వెల్లడించారు.
Also Read
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- 8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై స్పందిస్తూ.. తాజా గృహ వినియోగ వ్యయ సర్వే (HCES 2023-24)లోని గిని కోఎఫీషియంట్ డేటాను మంత్రి ఉటంకించారు. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో గిని సూచీ 0.266 నుంచి 0.237కు, పట్టణ ప్రాంతాల్లో 0.314 నుంచి 0.284కు తగ్గిందని, అంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగ అసమానతల వ్యత్యాసం తగ్గుతోందని వివరించారు. అంతేకాకుండా 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 2022లోని 3.6% నుంచి 2025 నాటికి 3.1%కి తగ్గిందని, నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం 2013-14, 2022-23 మధ్య కాలంలో దాదాపు 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.
ఆదాయ, సంపద అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. అత్యధిక ఆదాయం గడించే వారిపై సాధారణ ఆదాయ పన్నుతో పాటు అదనపు సర్‌ఛార్జ్‌లను విధించే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేస్తోంది. దీనితో పాటు ఉపాధి కల్పన, స్టార్టప్‌లు, సహకార రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనకు పన్ను మినహాయింపులు ఇస్తూనే.. పీఎం ఆవాస్ యోజన, పీఎం జన్‌ధన్ యోజన, పీఎం-కిసాన్, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోంది. ఐదేళ్లలో రూ. 100 కోట్లకు పైగా రాబడి చూపే పన్ను చెల్లింపుదారులు 300% పెరిగినప్పటికీ, సంపదకు సంబంధించిన అధికారిక డేటా లేకపోవడంతో భారతీయ కుబేరుల అసలు సంపద పరిమాణం ఎంతనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!