Site icon NTV Telugu

Indane Gas Customers: ఇన్‌డేన్‌ గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు. నిన్న సాయంత్రానికే తొలిగిపోతాయన్న ఐఓసీ

Indane Gas Customers

Indane Gas Customers

Indane Gas Customers: ఇండేన్‌ గ్యాస్‌ బుకింగ్‌, డెలివరీ సేవల్లో రెండు రోజులుగా అంతరాయం ఏర్పడినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, బహుశా ఈ రోజు సాయంత్రానికి ఇబ్బందులు తొలిగిపోతాయని, దీంతో రేపటి నుంచి యథావిధిగా సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు నిన్న మంగళవారం పేర్కొంది. అయితే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పలేదు. అంతరాయం నేపథ్యంలో కస్టమర్లు సిలిండర్ల రీఫిల్లింగ్‌ కోసం డిస్ట్రిబ్యూటర్ల వద్దకు పోటెత్తుతున్నారు.

14 రాష్ట్రాలకు రూ.7183 కోట్లు

రెవెన్యూ లోటు గ్రాంట్‌లో భాగంగా 6వ విడత కింద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 14 రాష్ట్రాలకు 7 వేల 183 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రాష్ట్రాలకు 86 వేల 201 కోట్ల రూపాయలను పోస్ట్‌ డెవల్యూషన్‌ రెవెన్యూ డెఫిసిట్‌ గ్రాంట్‌గా ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం రికమండ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా రిలీజ్‌ చేసిన ఫండ్స్‌తో కలిపి ఇప్పటివరకు ఇచ్చినవి 43 వేల 100 కోట్ల రూపాయలకు చేరినట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

‘Fine’ Apple: ‘యాపిల్‌’కి జరిమానా. ఏ మోడల్‌ ఫోన్లూ అమ్మొద్దంటూ ఆ దేశం నిర్మొహమాటంగా ఆదేశం

రవి నరైన్‌ అరెస్ట్‌

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ మాజీ సీఈఓ అండ్‌ ఎండీ రవి నరైన్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టు చేసింది. కోలొకేషన్‌ స్కామ్‌ కేసు, ఉద్యోగుల ఫోన్‌ నంబర్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్‌ చేసిన కేసులో ఆయన పాత్రపై విచారణ జరుగుతోంది. రవి నరైన్‌ 1994 ఏప్రిల్‌ నుంచి 2013 మార్చి వరకు NSE చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అనంతరం 2017 జూన్‌ వరకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో వైస్‌ చైర్మన్‌గా చేశారు. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ మరో మాజీ సీఈఓ అండ్‌ ఎండీ చిత్రా రామకృష్ణను కూడా ఈడీ గతంలోనే అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

గత రెండు రోజులకు భిన్నంగా ఇవాళ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 96.81 పాయింట్లు తగ్గి 59100.18 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. నిఫ్టీ 18.75 పాయింట్లు తగ్గి 17636.85 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్‌, రిలయెన్స్‌, టీసీఎస్‌ నష్టాల బాట పట్టాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పోల్చితే 79.72 వద్ద కొనసాగుతోంది.

Exit mobile version