NTV Telugu Site icon

Increase Credit: క్రెడిట్‌ పెంచుకోండి. ఎన్‌పీఏల పైనా ఫోకస్‌ పెట్టండి.

Increase Credit

Increase Credit

Increase Credit: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించింది. క్రెడిట్ గ్రోత్‌ను మరింత పెంచాలని, నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్ల స్థితిగతుల పైన కూడా ఫోకస్‌ పెట్టాలని ఆదేశించింది. నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కార్యకలాపాలను ప్రారంభించటంపై ఆసక్తితో ఉన్నామని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్‌ఏఆర్‌సీఎల్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేసిన అకౌంట్ల వివరాలను ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేసినట్లు సమాచారం.

ఎన్‌టీపీసీ ఫండ్‌రైజింగ్‌

ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లను జారీ చేయటం ద్వారా 12 వేల కోట్ల రూపాయల వరకు ఫండ్‌ రైజింగ్‌ చేసేందుకు ఎన్‌టీపీసీ.. షేర్‌ హోల్డర్ల అనుమతి పొందింది. తాజాగా జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో మెజారిటీ వాటాదారులు తీర్మానాన్ని ఆమోదించారు. నిధుల సేకరణను ఒకటీ రెండు దశల్లో పూర్తిచేస్తారు. ఈ ఫండ్స్‌ని.. క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌, వర్కింగ్‌ క్యాపిటల్‌ మరియు సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తారు.

Special Story on Vinayaka: వినాయక.. నిత్య (విద్యార్థులకు) స్ఫూర్తిదాయక..

ఎల్‌టీసీ కింద ఫ్లైట్‌ టికెట్లూ

లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది. వాటి ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఎల్‌టీసీ కింద ఫ్లైట్‌ టికెట్లు కూడా తీసుకోవచ్చు. జూన్‌ నెల నుంచి డ్యూటీలో భాగంగా విమానాల్లో ప్రయాణించేవారికి సైతం ఈ సర్క్యులర్‌ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఫ్లైట్‌ టికెట్లను మూడు ఆథరైజ్డ్‌ ట్రావెల్‌ ఏజెన్సీల నుంచి మాత్రమే తీసుకోవాలని పేర్కొంది. ఐఆర్‌సీటీసీతోపాటు బామర్‌ లారీ అండ్‌ కంపెనీ, అశోక్‌ ట్రావెల్స్‌ అండ్‌ టూర్స్‌ నుంచి టికెట్లు పొందితేనే ఎల్‌టీసీ కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

టయోటా భారీ పెట్టుబడి

విద్యుత్‌ వాహనాల బ్యాటరీల కోసం టయోటా మోటార్స్‌.. జపాన్‌, అమెరికాల్లో 5.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. నార్త్‌ కరోలినాలో బ్యాటరీల తయారీ కోసం ఇన్వెస్ట్‌ చేయనున్న 2.5 బిలియన్‌ డాలర్లకు ఇది అదనం కావటం విశేషం. 2024-26 మధ్య కాలంలో ఈ రెండు దేశాల్లో బ్యాటరీల ఉత్పత్తిని ప్రారంభించటం ద్వారా మొత్తం బ్యాటరీ ప్రొడక్షన్‌ కెపాసిటీని 40 గిగా వాట్‌ అవర్‌లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సరికొత్త ఉత్పత్తులు

ప్రీమియం లగేజ్‌ బ్రాండ్‌ అయిన శామ్‌సొనైట్‌.. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు సరికొత్త బయోడిగ్రేడబుల్‌, ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రొడక్టుల ధరలను 18,500 రూపాయల నుంచి 23,000 రూపాయలకు పైగా నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రయాణాలు భారీగా పెరుగుతున్నాయని, కొత్త ఉత్పత్తులకు డిమాండ్‌ నెలకొంటోందని శామ్‌సొనైట్‌ సీఈఓ జైకృష్ణన్‌ తెలిపారు. సంస్థ ప్రొడక్టుల స్టోరేజ్‌ మరియు వేర్‌హౌజింగ్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు 250 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు.

బెస్ట్‌ ట్రావెల్‌ ప్యాకేజీలు

ఖతార్‌లోని దోహాలో ఫిఫా వరల్డ్‌ కప్‌-2022కి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మరో మూడు నెలల్లో మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలు ట్రావెల్‌ ఏజెన్సీలు ఆ దేశానికి అత్యుత్తమ ప్యాకేజీలను ప్రకటించాయి. ఫనాటిక్‌ స్పోర్ట్స్‌, లెస్టాక్‌ ఇండియా, మేక్‌ మై ట్రిప్‌ వంటి సంస్థలు ప్రయాణంతోపాటు అకామడేషన్‌కి నాలుగైదు రకాల ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఒక్కో వ్యక్తికి మినిమం 35 వేల రూపాయలతో మొదలుపెట్టి రెండున్నర లక్షల రూపాయల వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.