India Growth: ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధి రేటులకు ఢోకా లేదని, భారతదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2023లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.3 శాతంగా ఉంటుందని తెలిపింది. గతంలోని అంచనాలను సవరించింది. ఏప్రిల్ నెలలో ఊహించినదాని కన్నా బలమైన వినియోగాన్ని భారత మార్కెట్ లో చూసింది. దీనికి అనుగుణంగా వృద్ధిరేటు అంచనాలను 6.3 శాతానికి సవరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకాశవంతమైన ప్రదేశాల్లో భారత్ ఒకటని ఐఎంఎఫ్ ప్రశంసించింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇజ్రాయిల్-హమాస్ వివాదంతో సహా వివిధ అంశాల కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు మందగించిందని, అయితే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అధికంగా ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ అంతకుముందు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి అంచనాలను 6.1 శాతం నుంచి 5.9 శాతానికి , 2024/25 ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ ఏడాది భారత వృద్ధి 6.5 శాతం ఉంటుందని అంచనా వేసింది.
Read Also: Hurun India Rich List 2023: అదానీని వెనక్కినెట్టి అగ్రస్థానంలోకి ముకేష్ అంబానీ..
మరోవైపు చైనా ఆర్థిక వృద్ధి 2023కి 5.2 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. 2024కి 4.5 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గించింది. ఆ దేశంలో రియల్ ఎస్టేట్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ తగ్గింపును అంచనాలను ప్రకటించింది. ఐఎంఎఫ్ చీప్ ఎకనామిస్ట్ పియరీ ఒలివియర్ గౌరించావ్ మాట్లాడుతూ.. చైనా రంగంలో బలమైన చర్యల ద్వారా విశ్వాసాన్ని తీసుకురావడం అసవరం అని చెప్పారు.
అమెరికా ఆర్థిక వృద్ధి ఈ ఏడాది మునుపటితో అంచనాల కన్నా 0.3 శాతం పాయింట్లు పెరిగి 2.1 శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది. యూరోపియన్ యూనియన్ ప్రాంతం వృద్ధి 0.7 శాతం, వచ్చే ఏడాది 1.2 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ఉక్రెయిన్ యుద్ధం, మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించింది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైందని, జీ 7 దేశాల్లోని ఏకైక దేశం ఆర్థికమాంద్యంలోకి ప్రవేశించింది.
మెరాకోలోని మారకేష్ లో జరిగిన ఐఎంఎఫ్ వార్షిక సమావేశంలో కోవిడ్-19, అనేక దేశాల్లో జీవన వ్యయ సంక్షోభం నుంచి అనేక ప్రమాదాల నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన స్థితిస్థాపకతను కనబరించిందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ప్రపంచ వృద్ధి ఈ ఏడాది 3 శాతం వచ్చే ఏడాది 2.9 శాతం ఉండే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.