Recharge Price Hike: టెలికాం ఆపరేటర్స్ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్ ధరలను 2026లో మరోసారి పెంచేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో ఆయా కంపెనీలు సగటున 20 శాతం వరకు టారిఫ్ ధరలను పెంచే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జులై 2024లో ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్ ధరలను 11 నుంచి 25 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. కాగా, 2026 నాటి పెంపుతో ఒక కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) గణనీయంగా పెంచేలా కంపెనీలు టార్గెట్ గా పెట్టుకున్నాయి.
Read Also: Gold Rates: మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన సిల్వర్, గోల్డ్ ధరలు
టారిఫ్‌లు పెంచడానికి ప్రధాన కారణం..
దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కంపెనీలు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. ఈ పెట్టుబడులపై రాబడి (ROI) కోసం ధరల పెంపు ఇప్పుడు అనివార్యంగా మారింది. టెలికాం రంగం లాభదాయకంగా ఉండాలంటే ‘ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం కనీసం 300 రూపాయలు దాటాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇది రూ.200 – రూ.210 మధ్య ఉంది. కేంద్ర ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ ఫీజులు, ఇతర లోన్స్ ను తీర్చుకోవడానికి కంపెనీలకు అదనపు నగదు ప్రవాహం అవసరమైంది.
Read Also: Shambhala : సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి, ఉషా పిక్చర్స్
సామాన్యులపై తీవ్ర భారం..
నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకి ఈ మొబైల్ రీఛార్జ్ ధరల పెంపు మరింత భారంగా మారనుంది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో కనీసం 3 నుంచి 4 మొబైల్ కనెక్షన్లు ఉండే అవకాశం ఉంది. 20 శాతం పెంపు అంటే వారి నెలవారీ డిజిటల్ ఖర్చు భారీ మొత్తంలో పెరగనుంది. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపించనుంది. డేటా ఖరీదుగా మారితే డిజిటల్ అక్షరాస్యత మందగించే ప్రమాదం కూడా ఉందనే చర్చ కొనసాగుతుంది. గత జులైలో జరిగిన ధరల పెంపు వల్ల చాలా మంది తమ సెకండరీ సిమ్ కార్డులకు రీఛార్జ్ చేయడం ఆపేశారు. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగే ప్రమాదం ఉంది.
