NTV Telugu Site icon

Credit card: క్రెడిట్ కార్డులను క్లోజ్‌ చేసుకోవాలా.. ఆర్బీఐ రూల్స్‌ తెలుసా..?

Credit Card

Credit Card

Credit card: ఈ రోజుల్లో చాలా మందికి ఒకటి మించి క్రెడిట్‌ కార్డులు ఉండటం కామన్ అయిపోయింది. బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారంగా క్రెడిట్‌ కార్డులు ఇస్తుండటంతో అవసరం లేకున్నా కొన్ని సార్లు వాటిని తీసుకుంటుంటారు. వీటికి వార్షిక రుసుములు లేకపోతే ఇబ్బంది లేదు కానీ.. ఒక వేళ రుసుము చెల్లించాల్సి ఉంటే అవసరం లేనివాటిని క్లోజ్‌ చేసుకోవడం బెటర్. కాగా, ఇలాంటి క్రెడిట్ కార్డులను ఎలా క్లోజ్‌ చేసుకోవాలి.. ఆర్బీఐ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే.

Read Also: Elon Musk: ఎలాన్ మస్క్ కి ఎదురుదెబ్బ.. మాజీ ఉద్యోగికి రూ.5కోట్ల పరిహారం!

అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం.. కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలని అభ్యర్థిస్తే.. సదరు బ్యాంకు, సంస్థ దానిని 7 రోజుల్లోపు అమలు చేయాల్సిందే.. కార్డును జారీ చేసే బ్యాంకు లేదా సంస్థ అలా చేయకపోతే.. 7 రోజుల తర్వాత, దానిపై రోజుకు 500 రూపాయల జరిమానాను వినియోగదారుడికి ఆయా బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ క్రెడిట్ కార్డ్‌లో ఎలాంటి బకాయిలు ఉండొద్దు.

Read Also: Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లు జలమయం

మీరు క్రెడిట్ కార్డును ఇలా క్లోజ్‌ చేసుకోవచ్చు..
* ఏదైనా క్రెడిట్ కార్డ్‌ని క్లోజ్ చేసే ముందు దాని బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించాలి.. బకాయి మొత్తాన్ని చెల్లించే వరకు క్రెడిట్ కార్డ్ క్లోజ్‌ చేసేందుకు అవకాశం ఉండదు.
* క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలనే తొందరలో చాలా మంది తమ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసుకోవడం మర్చిపోతారు. కార్డ్‌ను క్లోజ్ చేసేటప్పుడు రివార్డ్ పాయింట్‌లను తప్పనిసరిగా రీడీమ్ చేసుకోండి.
* మరి కొంతమంది బీమా ప్రీమియం, ఓటీటీ నెలవారీ ఛార్జ్ లాంటి పునరావృత చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌పై స్టాండింగ్ సూచనలను పెట్టుకుంటారు. కార్డ్‌ను క్లోజ్ చేయడానికి ముందు.. దానిపై అలాంటి సూచనలేవీ లేవని నిర్థారణ చేసుకోవాలి.
* అలాగే, అన్నీ సరి చూసుకున్నాక తర్వాతే క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌ను మీరు సంప్రదించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్‌ క్లోజ్ చేయడానికి గల కారణాన్ని అడిగితే చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్‌ క్లోజింగ్‌ అభ్యర్థన బ్యాంకులు తీసుకుంటాయి. ఒకవేళ బ్యాంక్ ఈ- మెయిల్ పంపమని అడిగితే.. కత్తిరించిన కార్డ్‌ ఫోటోను కూడా ఈ- మెయిల్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది.
* క్రెడిట్ కార్డు మూసివేసేటప్పుడు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే దానిని ఆ మూల నుంచి ఈ మూల వరకూ క్రాస్‌గా కత్తిరించాలి.. అలా కాకుండా కార్డును ఎక్కడపడితే అక్కడ పడేయొద్దు.. మీ కార్డు తప్పుడు చేతుల్లోకి వెళ్తే.. దానిని దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉంటుంది.

Show comments