Hero MotoCorp: కొన్ని సంస్థలు విడిపోయిన తర్వాత తమ ఉనికిని కోల్పోతాయి.. మరికొన్ని మాత్రం.. ఉవ్వెత్తున ఎగిసిపడతాయి.. అలాంటి కోవకు చెందింది హీరో మోటాకార్ప్ అని చెప్పాలి.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్.. తన బైక్‌లను కేవలం భారతదేశంలో మాత్రమే విక్రయించకుండా.. ప్రపంచవ్యాప్తంగా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌లో బైక్‌లను విడుదల చేస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తోంది. దీంతో.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సీఈవో పవన్ ముంజాల్ ఆదాయం 3.55 బిలియన్ డాలర్లకు చేరింది.. తన ద్విచక్ర వాహనాలను ఆసియా, ఆఫ్రికా, మధ్య మరియు దక్షిణ అమెరికా మరియు మధ్యప్రాచ్యంలోని 40కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది హీరో మోటాకార్ప్.
Read Also: Inter Exams: ఇంటర్ ఎగ్జామ్స్ పై విద్యాశాఖ కీలక సమీక్ష.. అలా చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు
ద్విచక్ర వాహనాల కోసం ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్‌లలో భారతదేశం ఒకటి మరియు ద్విచక్ర వాహనాల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే ఒక పేరు హీరో మోటోకార్ప్ యొక్క ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పవన్ ముంజాల్. ఆయన నేతృత్వంలోని హీరో మోటోకార్ప్ ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల తయారీదారుగా అవతరించింది.. హియర్ గ్రూప్‌ని పవన్ ముంజాల్ తండ్రి దివంగత బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ స్థాపించారు. ఫోర్బ్స్ ప్రకారం, డిసెంబర్ 10, 2022 నాటికి పవన్ ముంజాల్ మరియు కుటుంబ సభ్యుల “రియల్ టైమ్ నికర విలువ” 3.55 బిలియన్ డాలర్లుగా ఉందని మింట్ నివేదిక పేర్కొంది.. FY20లో పవన్ ముంజాల్ జీతం రూ. 84.59 కోట్లుగా ఉంది..
Read Also: Daughter harsh: సమాజం ఎటుపోతోంది.. తండ్రి ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పుపెట్టిన కన్న కూతురు..
హీరో హోండాగా పరిచయం ఉన్న సంస్థ.. హీరో మరియు హోండా 2011లో విడిపోయారు.. తర్వాత పవన్ ముంజాల్ కంపెనీని ముందుండి నడిపించారు.. హీరో మోటోకార్ప్ యొక్క ప్రపంచ విస్తరణకు నాయకత్వం వహించారు. పవన్ ముంజాల్ నేతృత్వంలోని హీరో మోటోకార్ప్‌కు భారతదేశంలో ఆరు సహా మొత్తంగా ఎనిమిది తయారీ కేంద్రాలు కలిగి ఉంది.. ఫోర్బ్స్ ప్రకారం, హీరో మోటోకార్ప్ భారతదేశంలో రెండు పరిశోధనా విభాగాలను కలిగి ఉంది. పవన్ ముంజాల్ CII మరియు SIAMలో ఎగ్జిక్యూటివ్ పదవులను కలిగి ఉన్నారు. ముంజాల్ ఆక్మే ప్యాకేజింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పాన్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బహదూర్ చంద్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హీరో ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ లిమిటెడ్ మరియు రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు ఇలా వ్యాపారాలను కలిగి ఉన్నారు. ఇక, అక్టోబర్ 2022లో, హీరో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడాను విడుదల చేసిన విషయం విదితమే.