HDFC Cash Flow: మళ్ళీ ఆ అకౌంట్లలో డబ్బు డబ్బు..
దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లోని HDFC వినియోగదారుల ఖాతాల్లో ఇంకా జమవుతూనే వున్నాయి కోట్లాది రూపాయలు. తాజాగా మెదక్ కి చెందిన వ్యక్తి బ్యాంకు అకౌంట్ లో లక్ష కాదు.. కోటి కాదు ఏకంగా రూ.9.61 కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యాయి. ఖాతాలో రూ.9.61 కోట్లు జమ అయినట్లు మెసేజ్ రావడంతో… నిజమా? కాదా? అనే అనుమానంతో రూ.4.97 లక్షలను మరో ఖాతాకు బదిలీ చేశాడు నరేందర్.
ఇంకేముంది.. తనకున్న క్రెడిట్ కార్డ్ బిల్ రూ.1.42 లక్షల రూపాయలు కట్టేశాడు నరేందర్. ఇంకా అకౌంట్ లో రూ. 9 కోట్లకు పైనే బ్యాలెన్స్ ఉండడంతో.. అసలు తన ఖాతాలోకి అంతమొత్తంలో డబ్బులు ఎందుకొచ్చాయో అర్థంకాక బ్యాంక్ కి వెళ్ళాడు నరేందర్. బ్యాంకు అధికారులు సాంకేతిక సమస్య అని చెప్పి నరేందర్ ఖాతాను ఫ్రీజ్ చేసి, వాడుకున్న మొత్తాన్ని మైనస్ బ్యాలెన్స్ గా చూపించారు బ్యాంక్ అధికారులు. ఇప్పుడు వాడుకున్న డబ్బులు ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నాడు నరేందర్..
Also Read
- Shloka Mehta: ఇంటర్నెట్ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్సిటీ.. వీడియో వైరల్
- Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
- Viral : పంది కడుపున 'ఏనుగు పిల్ల'.. విస్తుపోతున్న జనం.!
- Shocking Story: శవపేటిక దగ్గర కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు.. వీడియో వైరల్
ఇది ఒక్క నరేందర్ కథే కాదు.. దేశవ్యాప్తంగా అనేకమంది HDFC బ్యాంకు కస్టమర్లకు ఎదురైన అనుభవం. తమ బ్యాంకు అకౌంట్లలో ఇంత మొత్తం ఎందుకు పడిందా అని వారు తెగ ఆలోచించే లోపే అధికారులు బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నారు. ఒక్కో HDFC అకౌంట్లో ఒకే సారి 13 కోట్ల 50 లక్షలు జమ అయ్యాయి. దాదాపు వంద మంది కస్టమర్ల ఖాతాల్లో కోట్లు పడ్డాయి. అసలు ఇది నిజమేనా అన్న కొందరు ఏటీఎం కేంద్రాలకు వెళ్లి చెక్ చేసుకున్నారు.
వివిధ ప్రాంతాల్లో HDFC బ్యాంకు ఖాతాదారులు ఒక్కసారి కోటీశ్వరులయ్యారు. HDFC బ్యాంకు అకౌంట్లలోకి కుప్పలు.. తెప్పలుగా డబ్బు వచ్చిపడటం చూసి షాక్ అయ్యారు. చెన్నై, హైదరాబాద్, మెదక్… ఇలా అనేక చోట్ల ఇలా జరిగింది. విషయం తెలుసుకున్న చెన్నైలోని బర్కిట్ రోడ్ HDFC బ్రాంచ్ అధికారులు అలర్ట్ అయ్యారు. దాదాపు వంద ఖాతాలను హోల్డ్ చేశారు. బ్యాంక్ సర్వర్లలో కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
-
LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!
-
Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
-
Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?