NTV Telugu Site icon

GST on insurance: టర్మ్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ మినహాయించే అవకాశం..?

Gst

Gst

GST on insurance: బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. కాగా, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పుకొచ్చాయి. త్వరలో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటూ విశ్వసనీయ వర్గాలను ఓ వార్త బయటకు వచ్చిది.

Read Also: Himanta Biswa Sarma: అసెంబ్లీలో 2 గంటల నమాజ్ బ్రేక్ రద్దు.. అస్సాం సీఎం సంచలన నిర్ణయం..

కాగా, పెట్టుబడులకు సంబంధించిన బీమా పాలసీలపై మాత్రం జీఎస్టీ యథావిధిగా కొనసాగించే ఛాన్స్ ఉందని ఉన్నతాధికారి తెలిపినట్లు సమాచారం. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అనేది పూర్తిస్థాయి బీమా రక్షణ అందిస్తుండగా.. ఇతర పాలసీలు బీమాతో పాటు ప్రతిఫలాన్ని అందిస్తాయి.. కాబట్టి వీటిపై మినహాయింపు ఉండకపోవచ్చని సమాచారం. ఈ మినహయింపు వల్ల సుమారు 200 కోట్ల రూపాయల మేర కేంద్ర సర్కార్ ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టర్మ్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తొలగిస్తే.. ఆ మేర పాలసీదారులకు ప్రయోజనం.. తద్వారా మరింత మంది బీమా పరిధిలోకి వెళ్లే ఛాన్స్ ఉంది.

Read Also: New Zealand: న్యూజిలాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు కెప్టెన్ కీల‌క నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ తర్వాత..!

అయితే, జీవిత, ఆరోగ్య బీమా పాలసీలసై జీఎస్టీని తొలగించాలంటూ ఆర్థక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ ఇటీవల లేఖ రాయడంతో ఈ వ్యవహారంపై చర్చ స్టార్ట్ అయింది. తనకొచ్చిన విజ్ఞప్తిని గడ్కరీ ఆ లేఖలో ప్రస్తావించడంతో.. విపక్షాలు సైతం ఇన్సూరెన్స్‌ పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేశాయి. ప్రస్తుతం ఆరోగ్య బీమా, టర్మ్‌ ఇన్సూరెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధిస్తుంది. సంప్రదాయ బీమా ప్లాన్లపై వేర్వేరు రేట్లు అమలు చేస్తుంది. తొలి ఏడాది ప్రీమియంపై 4.5 శాతం, ఆ తర్వాత 2.25 చొప్పున జీఎస్టీ విధిస్తుంది. కేవలం టర్మ్‌ ఇన్సూరెన్స్‌పై మాత్రమే మినహాయింపు ఉంటుందా? ఆరోగ్య బీమాపై కూడా జీఎస్టీ రేట్లు తగ్గిస్తారా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు.