Multibagger Stock: అద్భుతం సృష్టించిన స్టాక్.. లక్ష పెట్టుబడి పెడితే రూ. 34 లక్షలకు పైగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Multibagger Stock: ఏ స్టాక్ ఎప్పుడు అద్భుతాలు చేస్తుందో.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులను ధనవంతులను చేస్తుందో ఊహించడం సాధ్యం కాదు. మార్కెట్లో అలాంటి అద్భుతాలు చేసిన స్టాక్‌లు చాలా ఉన్నాయి. అలాంటి స్టాక్‌లలో గ్రావిటా ఇండియా లిమిటెడ్ స్టాక్ ఒకటి. ఇది స్వల్పకాలంలో పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్‌గా ఉద్భవించింది. ఐదేళ్ల క్రితం ఇందులో రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసిన వారి షేర్ల విలువ ప్రస్తుతం రూ. 34 లక్షలకు పైగా పెరిగింది.
READ MORE: Visakhapatnam : విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ప్రమాదం
Also Read
- SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
గ్రావిటా ఇండియా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే.. 3,346% అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఒకప్పుడు ఇది ఒక రీసైక్లింగ్ సంస్థ. ఇది ప్రధానంగా సీసం, అల్యూమినియం, ప్లాస్టిక్ రీసైక్లింగ్‌లో ప్రత్యేకత కలిగి ఉండేది. 1992లో స్థాపించిన ఈ కంపెనీ వ్యాపారం భారతదేశంతో పాటు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇతర ఖండాలలో విస్తరించి ఉంది. ఆయా దేశాల్లో ఈ కంపెనీ యూనిట్లు ఉన్నాయి. కాగా.. 11 సెప్టెంబర్ 2020న, ఈ గ్రావిటా ఇండియా షేరు ధర కేవలం రూ. 49.30గా ఉండేది. అది ఇప్పుడు రూ. 1699కి పెరిగింది. దీని ప్రకారం.. కేవలం ఐదు సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు 3,346 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. ఒక పెట్టుబడిదారుడు ఐదు సంవత్సరాల క్రితం అంటే 2020 సెప్టెంబర్ 11న ఈ స్టాక్‌లో రూ. 49 చొప్పున లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 34,46,000కి పెరిగి ఉండేది.
READ MORE: West Bengal : వెస్ట్ బెంగాల్లో షాకింగ్ ఘటన – బాలికపై గ్యాంగ్ రేప్
తాజాగా గ్రావిటా ఇండియా స్టాక్ రోజంతా లాభాలతో ట్రేడ్ అయి చివరకు లాభాలతో ముగిసింది. ఇది రూ.1657.80 వద్ద ప్రారంభమైంది. ఆపై ట్రేడింగ్ ముగిసే సమయానికి ఊపందుకుంది. 2.49% లాభంతో రూ.1699 వద్ద ముగిసింది. దీని ప్రభావం కంపెనీ మార్కెట్ విలువపై కూడా కనిపించింది. కంపెనీ విలువ రూ.12330 కోట్లకు పెరిగింది. ఈ స్టాక్ యొక్క 52 వారాల గరిష్ట స్థాయి రూ.2700 కాగా, 52 వారాల కనిష్ట స్థాయి రూ.1379.65.
గమనిక: స్టాక్ మార్కెట్లో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, దయచేసి మీ మార్కెట్ నిపుణుల సలహా తీసుకోండి.
తాజావార్తలు
-
SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
-
BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
-
IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
-
Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
-
India T20 Captaincy: సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!