Big Relief: యుద్ధం వేళ కేంద్రం బిగ్ రిలీఫ్.. 6 నెలల పాటు EMI కట్టక్కర్లేదు..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు).. ఎగుమతిదారులకు ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారాలకు సహాయం చేయడానికి 3 నుంచి 6 నెలల పాటు రుణ వాయిదాల చెల్లింపు నిలిపివేత (Loan Moratorium) కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎందుకు ఈ నిర్ణయం..?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా ఇరాన్ వంటి దేశాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల వస్తువుల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, సరఫరా గొలుసు దెబ్బతింటోంది. ఈ ప్రభావం నేరుగా మన దేశంలోని చిన్న పరిశ్రమలపై పడుతోంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, చేతిలో నగదు కొరత ఏర్పడటంతో వ్యాపారస్తులు బ్యాంక్ రుణాలను సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.
Also Read
- Airtel Recharge Plans: Airtel కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. రూ.185, రూ.203, రూ.206.. వ్యాలిడిటీ, బెనిఫిట్స్ ఇవే!
- PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
- LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
- Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
మారటోరియం అంటే ఏమిటి..?
మారటోరియం అంటే నిర్ణీత కాలం పాటు అప్పు తీసుకున్న వారు తమ నెలవారీ వాయిదాలను (EMIs) చెల్లించకుండా వెసులుబాటు కల్పించడం. ప్రభుత్వం 3 నుంచి 6 నెలల పాటు ఈ సౌకర్యాన్ని ఇస్తే, ఆ కాలంలో వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న నగదును వ్యాపార అవసరాలకు వాడుకోవచ్చు. ఇది వారిపై ఆర్థిక భారాన్ని తాత్కాలికంగా తగ్గిస్తుంది.
పరిశ్రమల విజ్ఞప్తి..
వివిధ పారిశ్రామిక సంఘాలు , ఎగుమతిదారులు ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు తమ విన్నపాలను పంపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం వల్ల దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోతోందని, ఈ సమయంలో ప్రభుత్వ అండ అవసరమని వారు కోరుతున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై లోతైన అధ్యయనం చేస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే.. అది కేవలం వ్యాపారస్తులకే కాకుండా దేశ ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతుంది. వ్యాపారాలు మూతపడకుండా ఉంటేనే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే.. బ్యాంకులపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే కోణంలో కూడా ప్రభుత్వం చర్చిస్తోంది.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!