Site icon NTV Telugu

Google Layoffs: భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన గూగుల్..

Google

Google

Google Layoffs: ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ ఉద్యోగాల కోత క్రమంగా కొనసాగుతుంది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, సుంకాల యుద్ధం, అమెరికాలో ఆర్థిక మాంద్య భయం, వరుస నష్టాలు, ఏఐ వినియోగం పెరిగిపోతుండటంతో.. చాలా కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు ట్రై చేస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఎంప్లాయిస్ ను తొలగిస్తున్నాయి. అయితే, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 100 కంపెనీలు దాదాపు 27 వేల మందికి పైగా ఉద్యోగులను తీసేశాయి. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కూడా లేఆఫ్స్ ప్రకటించింది.

Read Also: PM Modi: వారణాసి గ్యాంగ్‌రేప్ ఘటనపై మోడీ ఆరా

అయితే, ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌, పిక్సెల్‌ ఫోన్స్‌, క్రోమ్‌ బ్రౌజర్‌ టీమ్స్ లో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు గూగుల్ కంపెనీ లేఆఫ్‌లు ప్రకటించింది. సంస్థలోని ఓ వ్యక్తి ద్వారా లేఆఫ్స్‌ విషయం బయటకు వచ్చినట్లు జాతీయ మీడియా తెలిపింది. కాగా, ఎంత మందిపై లేఆఫ్స్‌ ప్రభావం పడింది అనేది ఇప్పటి వరకు కచ్చితంగా తెలియలేదు. ఇక, గూగుల్‌ 2024 డిసెంబర్‌లో 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. అంతకుముందు ఏడాది (2023) జనవరిలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది గూగుల్. అయితే, 2025లో సాంకేతిక రంగంలో సుమారు 100 కంపెనీలు 27,762 మంది ఎంప్లాయిస్ ను విధుల నుంచి తొలగించాయి. అంతకు ముందు సంవత్సరం టెక్‌ రంగంలో 549 కంపెనీలు 1,52,472 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపశాయి.

Exit mobile version