Gold Rates: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 2026 నెలను దేశీయ బంగారం, వెండి ధరలు భారీ పెరుగుదలతో ప్రారంభించాయి. ఏప్రిల్ 1న 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములపై ఏకంగా రూ. 19,700 పెరగగా, 22 క్యారెట్లపై రూ. 18,000, 18 క్యారెట్లపై రూ. 14,800 వరకు పెరుగుదల నమోదైంది. గత మార్చి నెలలో ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కొత్త నెల ప్రారంభంలోనే ఈ స్థాయిలో పెరగడం విశేషం.
ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,51,480కి చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,38,850 వద్ద ఉంది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనిస్తూ కిలోకు రూ. 5,000 పెరిగి రూ. 2.55 లక్షల మార్కును తాకింది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ. 15,148 గా ఉంది.
Also Read
- Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
- Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్‌తో సరికొత్త చరిత్ర!
- Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ 'లాక్డౌన్' లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
ధరల పెరుగుదలకు కారణాలు..
అంతర్జాతీయంగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చనే ఆశలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం వల్ల క్రూడాయిల్ ధరలు తగ్గే అవకాశం ఉండటం, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్లించాయి. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ.. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం , వెండికి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరిగింది.
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ (COMEX) లో బంగారం ఔన్సు ధర 4,700 నుంచి 4,750 డాలర్ల వద్ద, వెండి 74 నుంచి 76 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. పారిశ్రామిక లోహాలకు డిమాండ్ పెరగడం కూడా వెండి ధరలకు మద్దతునిస్తోంది. అయితే.. ఇరాన్ మరియు మధ్యప్రాచ్యంలోని పరిణామాలు భవిష్యత్తులో ధరల దిశను నిర్ణయించవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్‌వుడ్, లివింగ్‌స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!