Gold and Silver Prices: ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో కొండెక్కుతున్న బంగారం, వెండి ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices: మధ్యప్రాచ్యంలో ముదిరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. యుద్ధం తీవ్రతరం కావడంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుంచి తమ డబ్బును బయటికి తీసుకొని, బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. అనిశ్చిత సమయాల్లో బంగారం ఎప్పుడూ ‘సేఫ్ హెవెన్’గా పరిగణించబడుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో బంగారం, వెండి ధరలు ఎలా మారబోతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Pakistan vs Sri Lanka: శ్రీలంక చేతిలో పాక్ జుట్టు.. ఈ తప్పు చేస్తే ఇంటికే!
Also Read
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,61,720 వద్ద ఉంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, త్వరలోనే తులాం బంగారం ధర రూ.2 లక్షల మార్కును చేరుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో బంగారంతో పాటు వెండి కూడా రికార్డు స్థాయికి చేరుకుంటోంది. పారిశ్రామిక డిమాండ్, సరఫరా గొలుసులో అంతరాయాల కారణంగా వెండి ధరలు గణనీయంగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద ట్రేడవుతోంది. కేవలం శుక్రవారం రోజే కిలో వెండిపై రూ.16,000 వరకు పెరగడం మార్కెట్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది.
సామాన్యుడిపై భారం..
ఈ ధరల పెరుగుదల కేవలం పెట్టుబడిదారులకే కాదు, సామాన్య ప్రజలకు కూడా కష్టాలను తెచ్చిపెడుతోందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సమయంలో ఆభరణాలు కొనడం సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోందని చెబుతున్నారు. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది, కాబట్టి నిపుణులు పెట్టుబడిదారులకు పలు సూచనలు చేస్తున్నారు. భారీ మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా, ధరలు కొంచెం తగ్గినప్పుడు చిన్నచిన్న మొత్తాల్లో బంగారాన్ని కొనడం ఉత్తమం అని చెబుతున్నారు. యుద్ధ పరిస్థితిపై స్పష్టత వచ్చే వరకు మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుందని, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
READ ALSO: Trump Bans Anthropic: AI ప్రపంచంలో సంచలనం సృష్టించిన ట్రంప్ .. అమెరికాలో ‘ఆంత్రోపిక్’ క్లోజ్!
తాజావార్తలు
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్‌లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!