Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Silver Price Surged in India on 2026 August 11: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం (2026 ఆగస్టు 11) అంతర్జాతీయ మార్కెట్లో లోహాల ధరలు బలపడటంతో పాటు దేశీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు గణనీయంగా పెరిగాయి. గత మూడు రోజుల్లోనే బంగారం ధర రూ.6,600 మేర పెరగగా.. వెండి ధర కిలోకు రూ.16,200 వరకు పెరిగింది. పెరిగిన ధరలతో కొనుగోలు దారులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
24 క్యారెట్ల బంగారం రూ.1.55 లక్షలు:
తాజా పెరుగుదలతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130కు చేరింది. 24 క్యారెట్ల పసిడి ఈ ఒక్క రోజులోనే రూ.3,160 పెరిగింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,900 పెరిగింది. దాంతో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,200కు చేరింది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారిపై ధరల ప్రభావం మరింత పెరగనుంది.
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
వెండి ధర కూడా భారీగా పెరుగుదల:
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా దూసుకెళ్లాయి. కిలో వెండిపై ఏకంగా రూ.10,000 పెరిగి.. రూ.2.60 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా వెండి ధరల్లో వచ్చిన మార్పు, భౌగోళిక అంశాలు దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. తాజా మార్కెట్ పరిణామాల్లో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపై పెట్టుబడిదారుల దృష్టి ఉండటంతో.. లోహాల్లో పెరుగుదల ఎక్కువగా ఉంది. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రెండు నెలలకు పైగా గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత స్వల్పంగా వెనక్కి తగ్గింది.
ఎందుకు పెరుగుతున్నాయి?:
అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ కదలికలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు అనిశ్చిత పరిస్థితుల్లో బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించడం కూడా ధరలకు మద్దతుగా నిలుస్తోంది. నగల దుకాణాల్లో వినియోగదారులు చెల్లించే తుది ధరలో బంగారం ప్రాథమిక రేటుతో పాటు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, ఇతర స్థానిక ఛార్జీలు కూడా ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. అందువల్ల ఆభరణాల కొనుగోలు సమయంలో స్థానిక జువెల్లర్ వద్ద తాజా రేటును తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!