Site icon NTV Telugu

Gold Rates: వామ్మో మళ్లీ షాకిచ్చిన పసిడి ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

Goldrates

Goldrates

బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు రోజులు శాంతించిన ధరలు.. దీపావళి ముగియగానే తన పంథా కొనసాగిస్తోంది. మళ్లీ జెట్ స్పీ్డ్‌లా ధరలు దూసుకెళ్తున్నాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,080 పెరగగా.. వెండి ధర మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.2,000 తగ్గింది.

ఇది కూడా చదవండి: Karoline Leavitt: ట్రంప్-పుతిన్ భేటీపై ప్రశ్న.. పరుష పదం ఉపయోగించిన కరోలిన్‌ లీవిట్‌

24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 2,080 పెరిగి రూ.1, 32, 770 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,900 పెరిగి రూ.1, 21, 700 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,560 పెరిగి రూ.99, 580 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: దీపావళి వేళ రాహుల్‌గాంధీ పెళ్లి ముచ్చట.. స్వీట్స్ షాపు ఓనర్ ఏం రిక్వెస్ట్ పెట్టాడంటే..!

మరోవైపు వెండి ధరలు మాత్రం ఉపశమనం కలిగిస్తున్నాయి. కిలో వెండి ధరపై రూ.2,000 తగ్గి రూ.1, 70, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 88, 000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం రూ.1, 70, 000 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: Delhi Weather: దీపావళితో మరింత క్షీణించిన ఢిల్లీ వాతావరణం

Exit mobile version