Gold and Silver Prices Today: గోల్డ్, సిల్వర్ ధరలు ఢమాల్.. ఊహించని రీతిలో తగ్గినయ్

Gold

Gold

గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధరలు భారీగా తగ్గడం ఆర్థిక మార్కెట్లలో చర్చనీయాంశమైంది. ఈ అనూహ్య పతనం ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) రేట్లు పెంచే సంకేతాలు ఇచ్చింది. దీంతో డాలర్ బలపడి, బంగారం (డాలర్‌లో ధర నిర్ణయమవుతుంది కాబట్టి) ఆకర్షణ కోల్పోయింది. US-Iran మధ్య శాంతి ఒప్పందం / Strait of Hormuz సంబంధిత చర్యలు సేఫ్-హేవెన్ డిమాండ్‌ను తగ్గించాయి. ఇన్ఫ్లేషన్ భయాలు, రేట్ హైక్ అంచనాలు కూడా ధరలపై ఒత్తిడి తెచ్చాయి. హైదరాబాద్ లో తులం పుత్తడి ధర రూ. 3650 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 15 వేలు తగ్గింది.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధర 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,586 , 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.13,370, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ. 10,939గా ఉంది.

×
×
Ad

తులం గోల్డ్ ధర రూ.3650 తగ్గింది

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 3650 తగ్గి రూ.1,45,860 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 3350 తగ్గి రూ.1,33,700 కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,46,010 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,33,850 వద్ద సేల్ అవుతోంది.

సిల్వర్ ధర

హైదరాబాద్ లో కిలో వెండి రూ. 2,55,000 వద్ద సేల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2,50,000 వద్ద ట్రేడ్ అవుతోంది.