తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు బుధవారం పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర క్రితంరోజుతో పోలిస్తే రూ.100 పెరిగింది. ప్రస్తుతం రూ.52,600 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.400 వరకు పెరిగింది. ప్రస్తుతం రూ.63,900కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
RBI Repo Rate: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మరో సారి వడ్డీ రేట్లు పెరిగాయ్..
హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.52,600గా ఉంది. కిలో వెండి ధర రూ.63,900 వద్ద కొనసాగుతోంది. ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,900గా ఉంది. విశాఖలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,600గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,900 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.52,600గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,900 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర కూడా పెరిగింది. ఔన్సు బంగారం 1848 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22.15 డాలర్లుగా ఉంది.