పసిడి ప్రియులకు భారీ ఊరట.. ఈరోజు కూడా ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. నిన్నటి ధరలే మార్కెట్ లో కొనసాగుతున్నాయి.. వరుసగా రెండు రోజులూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. ఆదివారం దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో మార్పులు కనిపించకపోగా, సోమవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు.. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడిచాయి.. ఈరోజు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,790 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,550, 24 క్యారెట్ల ధర రూ.61,690ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,550, 24 క్యారెట్లు రూ.61,690 ఉంది.
*. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,000, 24 క్యారెట్ల ధర రూ.62,180గా నమోదు అవుతుంది..
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,550, 24 క్యారెట్ల ధర రూ.61,690 గా ఉంది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,690 గా ఉంది..
ఇక వెండి విషయానికొస్తే.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,000 గా ఉంది. ముంబైలో రూ.76,000 ఉండగా.. చెన్నైలో రూ.79,000, బెంగళూరులో రూ.72,250 ఉంది. కేరళలో రూ.79,000, కోల్‌కతాలో రూ.76,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,000 గా కొనసాగుతుంది.. రెండు రోజులు ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..