పసిడి ప్రియులకు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.. బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.. బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతుండడం, ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది.. గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు పెరిగింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 పెరిగి రూ. 56,800కి చేరగా, 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 160 పెరిగి, తులం బంగారం రూ 61,960కి చేరింది. ధర ఇలాగే పెరిగితే మరో రోజులో తులం బంగారం రూ. 62 వేలు.. దాటుతుందని పక్కాగా కనిపిస్తోంది. మరి శుక్రవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా నమోదు అయ్యాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,00గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రూ. 62,200గా ఉంది.
* ముంబయిలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 56,800కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,110 గా ఉంది.
* అదే విధంగా కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 వద్ద ఉంది..
* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960గా ఉంది..
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 61,960 గా నమోదు అయ్యింది..
ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండిపై ఒకేరోజు ఏకంగా రూ. 500 పెరగడం విశేషం. దీంతో చెన్నైలో ఈ రోజు కిలో వెండి ధర రూ. 78,000కి చేరింది.ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి రూ. 75,100గా నమోదైంది. హైదరాబాద్ 78,000 గా నమోదు అయ్యింది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..