Gold Imports: బంగారంపై 15% దిగుమతి సుంకం ప్రభావం.. 70% తగ్గిన దిగుమతులు
- బంగారంపై 15% దిగుమతి సుంకం ప్రభావం
- 70% తగ్గిన దిగుమతులు
- 25-30 టన్నులకు మాత్రమే పరిమితమైందని అధికారులు తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన తర్వాత దేశంలో బంగారం దిగుమతులు భారీగా తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో నెలకు 75-100 టన్నుల వరకు దిగుమతి అయ్యే బంగారం ప్రస్తుతం 25-30 టన్నులకు మాత్రమే పరిమితమైందని అధికారులు తెలిపారు. అంటే దిగుమతులు దాదాపు 70 శాతం వరకు తగ్గినట్లుగా అంచనా.
అయితే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో విలువ పరంగా దిగుమతులు పెరిగాయి. 2026 మే నెలలో బంగారం దిగుమతుల విలువ గత ఏడాదితో పోలిస్తే 34 శాతం పెరిగి 3.41 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే ఏప్రిల్-మే కాలంలో బంగారం దిగుమతుల విలువ 60.14 శాతం పెరిగి 9.04 బిలియన్ డాలర్లకు నమోదైంది.
Also Read
- BCG Report 2026: పెట్రోల్ యుగానికి బ్రేక్ పడనుందా? భారత టూ వీలర్ మార్కెట్లో కొత్త ట్రెండ్..
- DA Hike: ఉద్యోగులు, పెన్షన్దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
- Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
- Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ బంగారం దిగుమతుల విలువ 24 శాతం పెరిగి రికార్డు స్థాయి 71.98 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే పరిమాణం పరంగా చూస్తే 4.76 శాతం తగ్గి 721.03 టన్నులకు పడిపోయింది. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగించే దేశం భారతదేశమే. దేశంలోని ఆభరణాల పరిశ్రమ అవసరాలే బంగారం దిగుమతులకు ప్రధాన కారణం. అయితే భారీ స్థాయిలో జరిగే ఈ దిగుమతులు విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని పెంచుతాయి.
ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లను తగ్గించి, విదేశీ మారక ద్రవ్యాన్ని ముడి చమురు, ఎరువులు, పారిశ్రామిక ముడి పదార్థాలు వంటి అత్యవసర దిగుమతుల కోసం వినియోగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా దిగుమతి వ్యయాలు మరింత పెరిగే అవకాశమున్నందున విదేశీ మారక ద్రవ్య వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
- Tags
- Gold
- Import Duty
- india
తాజావార్తలు
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!