పసిడి ప్రియులకు ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. ఆ మధ్య రెండు, మూడు రోజులు తగ్గినట్టే తగ్గి గోల్డ్ లవర్స్‌ను ఊరించగా.. తాజాగా మళ్లీ పెరిగిపోతున్నాయి. శుక్రవారం కూడా మరోసారి ధరలు పెరిగాయి. సిల్వర్ ధర మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. ఇక తులం గోల్డ్‌పై రూ.220 పెరగగా.. కిలో వెండిపై మాత్రం రూ.4,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Ambani Family Dance: అనంత్ అంబానీ ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేసిన ట్రంప్ కుమారుడు
24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.220 పెరిగి రూ.1,24,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 200 పెరిగి రూ.1,14,100 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.170 పెరిగి రూ.93,3600 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: G20 Summit: జీ20 సమ్మిట్‌కు ట్రంప్ గైర్హాజరు.. మోడీ హాజరు
ఇక వెండి ధరలు మాత్రం ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.4,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,61, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా కిలో వెండి ధర రూ.1,61, 000 దగ్గర అమ్ముడవుతోంది.
