Site icon NTV Telugu

Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

Gold (3)

Gold (3)

హమ్మయ్య.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న ఒక్కసారిగా అమాంతంగా పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు. పెళ్లిళ్ల సీజన్‌లో భారీగా పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందారు. మొత్తానికి ఈరోజు కాస్త ఉపశమనం కలిగింది. తులం గోల్డ్‌పై రూ.320 తగ్గగా.. వెండి ధర మాత్రం యథాతథంగా ఉంది.

ఈరోజు తులం గోల్డ్‌పై రూ.320 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,170 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.300 తగ్గడంతో రూ.1,43,150 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.240 తగ్గడంతో రూ.1,17,130 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇక ఈరోజు సిల్వర్ ధర భారీ ఉపశమనం కలిగింది. ధరలు యథాతథంగా ఉన్నాయి. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,70, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా అదే మాదిరిగా రూ.2,70, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Exit mobile version