Site icon NTV Telugu

Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

Gold (2)

Gold (2)

వామ్మో.. బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు, మూడు రోజులు తగ్గుముఖం పట్టడంతో తగ్గొచ్చని అంతా భావించారు. కానీ ఇంతలోనే షాకిచ్చాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు భారీ ఝలక్ ఇచ్చాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 2,290 పెరగగా.. కిలో వెండిపై ఏకంగా రూ.15,000 పెరిగింది.

ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,290 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,490 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,100 పెరగడంతో రూ.1,43,450 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,720 పెరగడంతో రూ.1,17,370 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇక ఈరోజు సిల్వర్ ధర భారీ షాకిచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.15,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2, 70, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా కిలో వెండి ధర రూ.2,70, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Exit mobile version