Site icon NTV Telugu

Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు బంగారం, గోల్డ్ ధరలు ఇలా..!

Gold

Gold

హమ్మయ్య.. పసిడి, సిల్వర్ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా రాకెట్‌లా ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. ఇంకోవైపు ఆయా శుభకార్యాలు జరుగుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. ధరలేమో కొండెక్కాయి. ఆభరణాలేమో అవసరం అయ్యాయి. దీంతో ఇంత పెద్ద ధరలో ఎలా కొనగలమంటూ సామాన్యులు హడలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో శుక్రవారం ధరలకు కళ్లెం పడ్డాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.8,230 తగ్గగా.. కిలో వెండిపై రూ.15,000 తగ్గింది.

ఇది కూడా చదవండి: UK-China: 10 ఒప్పందాలపై యూకే-చైనా సంతకాలు.. దేనికి సంకేతాలు!

తులం గోల్డ్‌పై రూ.8,230 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,70,620 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.7,550 తగ్గడంతో రూ.1,56,400 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.6,170 తగ్గడంతో రూ.1,27,970 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Ajit Pawar Plane Crash: మహిళా పైలట్లపై అజిత్ పవార్ చేసిన పాత పోస్ట్ వైరల్

ఇక వెండి కూడా శాంతించింది. కిలో వెండిపై రూ.15,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,95, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.4,15,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.3,95, 000 దగ్గర అమ్ముడవుతోంది.

Exit mobile version