దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. మే నెల వరకు ముహూర్తాలు ఉండడంతో వేలాది వివాహాలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో కనకం ధర ఠారెత్తిస్తోంది. రాకెట్‌లా ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో సామాన్యుల గుండె ఝళ్లుమంటోంది. బాబోయ్.. ఎలా కొనగలమంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.3,220 పెరగగా.. కిలో వెండిపై రూ.10,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
తులం గోల్డ్‌పై రూ.3,220 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,65,170 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,950 పెరగడంతో రూ.1,51,400 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,420 పెరగడంతో రూ.1,23,880 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: తీవ్ర షాకయ్యా.. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తునకు మమత డిమాండ్
ఇక వెండి విశ్వరూపం సృష్టించింది. కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.4 లక్షలకు చేరింది. ఇక బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,80, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.4,00,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.3,80, 000 దగ్గర అమ్ముడవుతోంది.
