బాబోయ్ సిల్వర్‌కు ఏమైంది? ఎన్నడూ లేనంతగా ధరలు దూసుకుపోతున్నాయి. గతేడాది రికార్డుల మోత మోగించిన ధరలు.. ఈ ఏడాది కూడా అలానే ఉంది. ఇటీవలే వెండి ధర సరికొత్త రికార్డ్ సృష్టించింది. రూ.3 లక్షల మార్కు దాటి కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు మరో రికార్డ్ దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే 4 లక్షల మార్కు చేరేటట్టు కనిపిస్తోంది. ఇక బంగారం పరిస్థితి కూడా అలానే ఉంది. గోల్డ్ రేట్ కూడా ఆకాశన్నంటుతోంది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,040 పెరగగా.. కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.3,30,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రేంజ్‌లో ధరలు ఉంటే సామాన్యుడు ఇంకేమి కొంటాడు. ధర మాట వింటేనే బెంబేలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Netanyahu-Iran: ఇరాన్‌కు నెతన్యాహు తీవ్ర వార్నింగ్.. మునుపెన్నడూ చూడని శక్తిని చూస్తారని హెచ్చరిక
ఈరోజు కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,15, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,30,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.3,15, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Greenland: గ్రీన్‌లాండ్‌లో ఉద్రిక్తతలు.. అమెరికా యుద్ధ విమానాలు మోహరింపు!
ఇక తులం గోల్డ్‌పై రూ.1,040 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.950 పెరగడంతో రూ.1,35,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.780 పెరిగి రూ.1,10,460 దగ్గర ట్రేడ్ అవుతోంది.
