సిల్వర్ దూకుడు ఆగడం లేదు. ఒకరోజు తగ్గినట్టే తగ్గి.. మరుసటి రోజు అమాంతంగా పెరిగిపోతుంది. రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టగా.. ఈరోజు భారీగా పెరిగింది. దీంతో వెండి ధరలకు బ్రేక్‌లు పడేటట్టు కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా బంగారం, వెండి ధరలు విశ్వరూపం సృష్టిస్తున్నాయి. ఈరోజు తులం గోల్డ్ ధరపై రూ.1,150 పెరగగా.. కిలో వెండి ధరపై రూ.11,000 పెరిగింది. దీంతో కొనుగోలుదారులు హడలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Trump: జేడీ వాన్స్, మార్కో రూబియో పిల్లలకు ట్రంప్ బహుమతులు.. ఏమిచ్చారంటే..!
వింటర్‌లో సిల్వర్ ధర హీటెక్కిస్తోంది. ఈరోజు ఏకంగా కిలో వెండిపై రూ.11,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,60, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,75,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,60, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Trump-Greenland: గ్రీన్‌లాండ్ కావాలంటే ఇలా చేయండి.. వైరల్‌గా మారిన ట్రంప్‌కు కొత్త ప్రతిపాదన
ఇక తులం గోల్డ్‌పై రూ.1,150 పెరగగా బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,460 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,050 పెరగగా రూ.1,28,750 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.86 పెరగగా రూ.1,05,340 దగ్గర ట్రేడ్ అవుతోంది.
