గతేడాది బంగారం, సిల్వర్ ధరలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఎన్నడూ లేనంతగా ధరలు ఆకాశన్నంటాయి. బంగారం మెరుపులు సృష్టిస్తే.. సిల్వర్ అయితే ఒక వెలుగు వెలిగింది. అంతగా ధరలు హడలెత్తించాయి. సామాన్యులు అయితే పసిడి కొనాలంటేనే బెంబేలెత్తిపోయారు. ఇక న్యూఇయర్ వేళ బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగించింది.
ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్‌కు న్యూఇయర్ జోష్.. లాభాల్లో సూచీలు
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.170 పెరగగా.. రూ.1,35,060 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.150 పెరగగా రూ.1,23,800 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.120 పెరగగా రూ.1,01,290 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Bihar: హిజాబ్ వివాదం.. విధుల్లో చేరని వైద్యురాలు.. అధికారులు ఏం చేయబోతున్నారంటే..!
మొత్తానికి కొత్త సంవత్సరం వేళ వెండి ధర రిలీఫ్ ఇచ్చింది. ఈరోజు కిలో వెండిపై రూ.1,000 తగ్గింది. దీంతో ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,38, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,56,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,38, 000 దగ్గర అమ్ముడవుతోంది.
