Site icon NTV Telugu

Silver Rates: బాబోయ్ సిల్వర్.. మరోసారి భారీగా పెరిగిన వెండి ధర

Silver

Silver

వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? ఈ ఏడాది వెండి మెరుపులు సృష్టిస్తోంది. గత కొద్దిరోజుల క్రితం వరకు కిలో వెండి లక్ష రూపాయుల కంటే తక్కువగా ఉండేది. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. జెట్ స్పీడ్‌లో ధరలు దూసుకుపోయాయి. మొన్నటికి మొన్న 2 లక్షల మార్కు దాటి సరికొత్త రికార్డు సృష్టించగా.. ఇప్పుడు 3 లక్షల మార్కుకు చేరువలో ఉంది. దీంతో మరోసారి సరికొత్త రికార్డ్ సృష్టించేందుకు పరుగులు పెడుతోంది. మరోవైపు బంగారం కూడా అదే రీతిగా వెళ్తోంది. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఇక ఈరోజు కిలో వెండిపై రూ.6,000 పెరగగా.. తులం గోల్డ్‌పై రూ.770 పెరిగింది.

ఇది కూడా చదవండి: Putin-Bush: వెలుగులోకి 20 ఏళ్ల నాటి పుతిన్-బుష్ సంభాషణ.. పాక్‌ గురించి ఏం చర్చించారంటే..!

సిల్వర్ ధర బిగ్ షాకిచ్చింది. ఈరోజు కిలో వెండిపై రూ.6,000 పెరిగింది. దీంతో సరికొత్త రికార్డ్ స్థాయిలో ధర దూసుకుపోతుంది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి ధర రూ.2,40, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్‌, చెన్నై బులియన్ మార్కెట్‌లో మాత్రం రూ.2,54,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,40, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Canada: కెనడాలో మరో ఘోరం.. టొరంటో వర్సిటీలో భారతీయ విద్యార్థి హత్య

ఇక బంగారం ధర కూడా దూసుకుపోతుంది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.770 పెరిగి.. రూ.1,40,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 700 పెరిగి రూ.1,28,350 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.580 పెరిగి రూ.1,05,020 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Exit mobile version