Site icon NTV Telugu

Gold Rates: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు..

Gold Rates Today

Gold Rates Today

బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఇది పసిడి ప్రేమికులకు ఊరట కలిగించే అంశం. జూలై 8న బంగారం ధర నేలచూపులు చూసింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 820 మేర తగ్గింది. దీంతో ఈ పసిడి రేటు 10 గ్రాములకు రూ. 51,110కు దిగి వచ్చింది. మార్కెట్‌లో ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మార్కెట్‌లో రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.750, 24 క్యారెట్లపై రూ.820 మేర తగ్గింది. దేశీయంగా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.100 మేర పెరిగి.. రూ.57,000 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నయో తెలుసుకుందాం.

  1. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,110 వద్ద ఉంది.
  2. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
  3. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.
  4. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,970 వద్ద ఉంది.
  5. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.
  6. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
  7. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150 ఉంది.

వెండి ధరలు ఇలా..: హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,400, విజయవాడలో రూ.62,400, విశాఖపట్నంలో రూ.62,400 లుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.57,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.57,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.62,400 ఉంది. బెంగళూరులో రూ.62,400, కేరళలో రూ.62,400లుగా కొనసాగుతోంది.

పసిడి రేటుపై అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం ధరల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. అందువల్ల మన దగ్గర బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్‌లోని రేట్లపై ఆధారపడి ఉంటాయి. బంగారం ధరలు తగ్గాయి. అందువల్ల ఇప్పుడు కొనొచ్చా? అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పసిడి రేటు పడిపోవడం సానుకూల అంశం. అందువల్ల బంగారు ప్రియులు గోల్డ్ జువెలరీ కొనుగోలు చేయొచ్చు. బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 56 వేలకు పైనే ఉంది. అందువల్ల అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు గోల్డ్ రేటు భారీగానే తగ్గిందని చెప్పుకోవాలి.

Exit mobile version