బంగారం ప్రియులకు ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. బుధవారం మాత్రం ఝలక్ ఇచ్చాయి. క్రిస్మస్ పండగ సమయానికైనా తగ్గుతాయేమోనని గోల్డ్ లవర్స్ భావించారు. కానీ అందుకు భిన్నంగా ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.870 పెరగగా.. కిలో వెండిపై 9,000 పెరిగింది. దీంతో సిల్వర్ ధర రికార్డ్ స్థాయిలో దూసుకుపోతుంది.
ఇది కూడా చదవండి: H-1B Visa: భారతీయులకు షాక్.. హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.870 పెరగగా.. రూ.1,30,310 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 800 పెరిగి రూ.1,19,450 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 పెరిగి రూ.97,730 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Plane Crash Video: ఫ్లోరిడా హైవేపై విమానం ఎమర్జెన్సీ ల్యాండ్.. కారును ఢీకొట్టి ఆగిన ఫ్లైట్
ఇక సిల్వర్ ధర మాత్రం షాకిచ్చింది. ఈరోజు ఏకంగా కిలో వెండిపై రూ.9,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రూ.2,07,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,99, 000 దగ్గర అమ్ముడవుతోంది.
