NTV Telugu Site icon

Gold Rates: స్థిరంగా బంగారం ధరలు.. మరి వెండి?

Gold Rates Today

Gold Rates Today

దేశీయ మార్కెట్లలో గత రెండ్రోజులుగా పసిడి ధరలకు బ్రేక్ పడింది. జూన్‌లో పరుగులు పెట్టిన బంగారం ధరలు జులై ప్రారంభం నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం స్థిరంగా కొనసాగిన బంగారం ధరల్లో మంగళవారం కూడా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయ విలువ రోజురోజుకు దిగజారుతుండడం.. రానున్న రోజుల్లో మరింత పతనం కానుందనే అంచనాలు మధ్య భారత సర్కారు బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచడంతో గతవారం దేశీయంగా ధరలు భగ్గుమన్నాయి. శని, ఆదివారాల్లో పైకి ఎగిసిన ధరలు సోమవారం, మంగళవారాల్లో మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,340గా ఉంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,340గా ఉంది.
  2. ఇక, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,340గా ఉంది.
  3. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 52,340గా ఉంది.
  4. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు ఉదయం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,340గా ఉంది.
  5. బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420గా ఉంది.

వెండి ధరలు ఇలా: ఇక బంగారం బాటలోనే వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.57,800గా ఉంది. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ ప్రాంతాల్లో కేజీ వెండి ధర రూ. 63,500 గా ఉంది. అలాగే ముంబైలోనూ కిలో వెండి ధర రూ. 57,800గా ఉంది. ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో కిలో వెండిధర రూ. 57,800 ఉంది.

Show comments