గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. రోజుకోలాగా హెచ్చు తగ్గులు అవుతున్న పసిడి ధరలతో కొనుగోలుదారులు నిరాశకు గురవుతున్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు బాగున్నప్పటికీ బంగారం ధరలు తగ్గకపోవడంతో మగువలు అసంతృప్తిగా ఉన్నారు. ఈరోజు మాత్రం తులం గోల్డ్‌పై రూ. 540 తగ్గగా.. సిల్వర్ మాత్రం చుక్కలు చూపించింది. ఏకంగా కిలో వెండిపై రూ.3,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Supreme Court: సుప్రీంకోర్టుకు ‘ఇండిగో సంక్షోభం’.. ఏం తీర్పు ఇవ్వనుందో..!
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.540 తగ్గి రూ.1,30,150 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 500 తగ్గి రూ.1,19,300 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.410 తగ్గి రూ.97,610 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Indian Railways: విమాన ప్రయాణికుల కష్టాలకు రైల్వే శాఖ చెక్.. ప్రత్యేక ట్రైన్ సర్వీసులు ఏర్పాటు
ఇక వెండి ధర భారీ షాకిచ్చింది. కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,90, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక చెన్నైలో రూ.1,99,000, హైదరాబాద్‌లో మాత్రం రూ.1,95,900 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,90, 000 దగ్గర అమ్ముడవుతోంది.
