పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. గురువారం బంగారం ధరలు తగ్గాయి. పుత్తడి ధరలు రోజుకో విధంగా ఉంటున్నాయి. ఒకరోజు స్వల్పంగా తగ్గుతుంటే.. ఇంకో రోజు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో గోల్డ్ లవర్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు కూల్‌గా ఉన్నప్పటికీ ధరలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తగ్గితే భారీగా కొనేందుకు పసిడి ప్రియులు ఎదురుచూస్తు్న్నారు. ఇక ఈరోజు తులం గోల్డ్‌పై రూ.220 తగ్గింది. వెండి ధర మాత్రం యథాతథంగా ఉంది.
ఇది కూడా చదవండి: Netanyahu-Mamdani: న్యూయార్క్ టూర్‌కు ఇజ్రాయెల్ ప్రధాని.. అరెస్ట్ చేస్తామంటూ మమ్దానీ హెచ్చరిక
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.220 తగ్గి రూ.1,30,360 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 200 తగ్గి రూ.1,19,500 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 తగ్గి రూ.97,780 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Governor Grandson Harassment: గవర్నర్ మనవడి భార్య వరకట్న ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు
ఇక వెండి ధర ఉపశమనం ఇచ్చింది. నేటి ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,91, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.2,00,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,91, 000 దగ్గర అమ్ముడవుతోంది.
