పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మధ్య బంగారం ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఒక్కోసారి అమాంతంగా పెరిగిపోతుండగా.. మరొక రోజు స్వల్పంగా తగ్గుతుంది. రోజుకో విధంగా ధరలు ఊగిసలాడుతున్నాయి. సోమవారం మరోసారి బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి మాత్రం భారీగా పెరిగింది. తులం గోల్డ్‌పై రూ.170 పెరగగా.. కిలో సిల్వర్‌పై మాత్రం రూ.2,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: ప్రియురాలు పదే పదే ఆ ప్రస్తావన తేవడంతో ప్రియుడు ఏం చేశాడంటే..!
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.170 పెరిగి.. రూ.1, 23, 170 దగ్గర అమ్ముడవుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 150 పెరిగి.. రూ. 1, 12, 900 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.130 పెరిగి.. రూ.92, 380 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Bihar Elections: గురువారమే తొలి విడత పోలింగ్.. అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచారం
ఇక వెండి ధర మాత్రం రూ.2,000 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,54,000గా అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,68,000గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.1,54,000గా ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Chevella Tragedy: చేవెళ్ల దారుణం.. స్పందించిన సీఎం రేవంత్, కేసీఆర్..!
