NTV Telugu Site icon

Gold Rates: భారీగా తగ్గిన పసిడి ధరలు.. కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం..!!

Gold Rates

Gold Rates

Gold Rates: దేశవ్యాప్తంగా పసిడి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 540 తగ్గి రూ.50,730కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.46,500 కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950గా నమోదు కాగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,700గా ఉంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ.58వేలుగా పలుకుతోంది.

Read Also: NASA Artemis 1 Launch: రేపే ఆర్టెమిస్‌-1 ప్రయోగం.. సిద్ధం చేసిన నాసా..

హైదరాబాద్​బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ధర రూ.46,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,730గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. తమిళనాడులోని చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.480 తగ్గి రూ.51,380కి చేరగా.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ.440 తగ్గి రూ.47,100గా నమోదైంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,550గా ఉందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. బంగారం, వెండి తరహాలోనే ప్లాటినం ధర కూడా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.370 తగ్గి రూ.21,410గా నమోదైంది.