మళ్లీ 50వేల మార్క్ దాటిన పసిడి ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రేమికులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ బంగారం ధర భారీగా పెరిగింది.. ఆల్‌టైం హై రికార్డులను సృష్టించిన బంగారం ధర.. కాస్త ఊరట కలిగిస్తూ మళ్లీ దిగివచ్చాయి.. కానీ, ఇప్పుడు మళ్లీ పైకి కదులుతూ 50 వేల మార్క్‌ను క్రాస్ చేశాయి.. దీంతో.. హైదరాబాద్‌లో చాలా నెలల తర్వాత రూ.50 వేలస్థాయిని దాటినట్టు అయ్యింది.. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.760 పెరిగి, 50,070కు చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 మేర ఎగసి రూ. 45,900 స్థాయిని తాకింది.. ఈ ఏడాదిలో జూలై 21 తర్వాత పుత్తడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు… ఇదేబాటలో భారత్‌లోని మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర 9 నెలల గరిష్ఠం రూ.49,277 వద్దకు ఎగిసింది.
మరోవైపు పుత్తడి దారిలోనే వెండి కూడా పెరిగింది.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,300 మేర పుంజుకుని, రూ. 70,600కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1860 డాలర్ల పైకి చేరడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి పరుగులు పెడుతోందని.. దానికి తోడు శుభకార్యాలు, పెళ్లిళ్లతో డిమాండ్ పెరగడం కూడా కారణంగా చెబుతున్నారు నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు 0.09 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1862 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా కొద్దిగా క్షీణించింది. ఔన్స్‌కు 0.03 శాతం తగ్గుదలతో 25.29 డాలర్లకు తగ్గింది.
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
తాజావార్తలు
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!