Site icon NTV Telugu

Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. నేడు ఎంత తగ్గిందంటే..!

Goldrates

Goldrates

గత కొద్దిరోజులుగా రాకెట్‌లా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. దీపావళికి బంగారం కొనుగోలు చేద్దామనుకున్న పసిడి ప్రియులకు శనివారం కాస్త ధరలు ఉపశమనం కలిగించాయి. గోల్డ్, సిల్వర్ ధరలు దిగొచ్చాయి. తులం బంగారం ధరపై రూ. 1,910 తగ్గగా.. కిలో సిల్వర్‌పై రూ. 13,000 తగ్గింది. దీంతో పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది.

ఇది కూడా చదవండి: Rashid Khan: అనాగరికం.. అనైతికం.. పాకిస్థాన్‌ దుశ్చర్యపై రషీద్ ఖాన్ ధ్వజం

24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 1,910 తగ్గి రూ.1, 30, 860 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,750 తగ్గి రూ.1, 19, 950 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,440 తగ్గి రూ.98. 140 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: Maithili Thakur: ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తా.. అలీనగర్‌లో నామినేషన్ వేసిన మైథిలి ఠాకూర్

మరోవైపు వెండి ధరలు కూడా భారీ ఊరటనిస్తున్నాయి. వరుసగా పెరిగిన వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. కిలో వెండిపై ఈరోజు ఏకంగా రూ.13,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1, 72, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 90, 000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో మాత్రం రూ.1, 72, 000 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: Pakistan-Afghan War: పాకిస్థాన్ వైమానిక దాడి.. ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు సహా 8 మంది మృతి

Exit mobile version