NTV Telugu Site icon

Gold and Silver Price: పసిడి ప్రేమికులకు శుభవార్త..

Gold Prices

Gold Prices

బంగారం కొనేవారికి శుభవార్త చెబుతూ ఇవాళ నిలకడగా ఉన్నాయి పసిడి ధరలు.. ఇదే సమయంలో.. వెండి మాత్రం భారీగా తగ్గింది.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ సహా ఇతర నగరాల్లో ఇవాళ నమోదైన బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఇవాళ ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.45,800 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.49,970 పలుకుతోంది. ఇక, దేశీయంగా కిలో వెండి రూ. 400 తగ్గి రూ. 55,000 దగ్గర కొనసాగుతోంది.

Read Also: Vanisri: సీనియర్‌ హీరోయిన్‌ రూ.20 కోట్ల విలువైన స్థలం కబ్జా.. తిరిగి అప్పగించిన సీఎం..

దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,450గా, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా ఉంది. ఇక, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020గాను.. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా ఉంది. మరోవైపు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.49,970గా ఉంది.. ఇక, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,970గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,000గా ఉండగా.. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు మరియు కేరళ నగరాల్లో కూడా అదే ధరకు అందుబాటులో ఉంది. మరోవైపు.. ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.55,000గా ఉంది.