NTV Telugu Site icon

Gold and Silver Price: పెళ్లిళ్ల సీజన్‌.. షాకిస్తున్న పసిడి ధరలు..

Gold

Gold

డిసెంబర్‌ నెల ఆరంభం నుంచి శుభకార్యాలు ప్రారంభం అయ్యాయి… పెద్ది ఎత్తున్న పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి.. దీంతో, బంగారానికి డిమాండ్‌ పెరిగింది… దీంతో, ధర కూడా పైపైకి కదులుతోంది.. నిన్న స్థిరంగా ఉండి ఊరట కలిగించిన పసిడి ధర.. ఇవాళ మళ్లీ పెరిగింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 మేర పెరిగి రూ.49,750కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగి రూ.54,280కి ఎగిసింది.. మరోవైపు, పసిడి దారిలోనే వెండి కూడా భారీగా పెరిగింది.. కిలో వెండి ధర కేకంగా రూ.1400 పెరిగింది.. దీంతో, కిలో వెండి ధర రూ.67,600కు చేరింది.

Read Also: Attack on Police Station: పంజాబ్‌లో పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి.. పాక్ హస్తముందా?

దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయనే విషానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,900కి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,440కి పెరిగింది.. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,750గా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,280గా పలుకుతోంది.. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,750కి, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,280కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,470గా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,060గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తిడి ధర రూ. 49,800గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,330గా పలుకుతోంది.. మరోవైపు, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,750గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,280గా.. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,750గా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,280గా ట్రేడ్‌ అవుతోంది. ఇక, వెండి ధరల విషయానికి వస్తే.. కిలో వెండి ధర కోల్‌కతాలో రూ. 67,600, ఢిల్లీలో రూ. 67,600గా, ముంబైలో రూ. 67,600గా, చెన్నైలో రూ.72,500గా, బెంగుళూరులో రూ. 72,500, హైదరాబాద్‌లో రూ. 72,500గా, విజయవాడలో రూ. 72,500గా పలుకుతోంది.