Go First: గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాళా.. 3 రోజలు పాటు ఫ్లైట్స్ బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Go First: దేశంలో ప్రైవేటు రంగ విమానయాన సంస్థల్లో ఒకటైన గోఫస్ట్ దివాళా తీసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సంస్థ ఈ రోజు జాతీయ లా ట్రిబ్యునల్ ముందు దివాళా పిటిషన్ దాఖలు చేసింది. 27 దేశీయ గమ్యస్థానాలతో పాటు 7 అంతర్జాతీయ నగరాలకు గో ఫస్ట్ విమాన సేవల్ని అందిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద ఎయిర్ లైనర్ గా ఉంది.
Read Also: CM KCR: కల్లుగీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థకు యూఎస్ కంపెనీ అయిన ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ నుంచి విమానాల ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగా నిధుల కొరత తలెత్తినట్లు ఆ సంస్థ సీఈఓ కౌశిక్ కోనా తెలిపారు. ఈ నేపథ్యంలోనే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద స్వచ్ఛంద దివాళా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే గో ఫస్ట్ కు చెందిన 28 విమానాలు నిలిచిపోయినట్లు ఆయన తెలిపారు. ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సకాలంలో ఇంజిన్లు సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని, నిధుల కొరత ఏర్పడిందని ఆయన వెల్లడించారు.
మరోవైపు ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సరఫరా చేస్తున్న ఇంజిన్లు ఫెయిల్ అవుతుండటం కూడా గోఫస్ట్ ను దెబ్బతీస్తోంది. ఈ సంస్థ సరఫరా చేస్తున్న ఇంజిన్లలో ఫాల్ట్ ఉన్న ఇంజిన్ల కారణంగా నడవకుండా ఉన్న విమానాల సంఖ్య డిసెంబర్ 2019లో 7 శాతం నుండి డిసెంబర్ 2020లో 31 శాతానికి పెరిగి డిసెంబర్ 2022 నాటికి 50 శాతానికి చేరిందని ఎయిర్‌లైన్ తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాట్ & విట్నీ స్పేర్ లీజు ఇంజిన్లను అందించడంలో విఫలమైతే, విమానాలకు మరిన్ని ఇంజిన్ల ఫెయిల్యూర్స్ తతెత్తితే ఈ ఎయిర్ లైన్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. గో ఫస్ట్ 5,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. తన వెబ్సైట్లో, విమానయాన సంస్థ తమ ఫ్లీట్‌లో 59 విమానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే గోఫస్ట్ తదుపరి 3 రోజుల పాటు అన్ని విమానాలను రద్దు చేసింది. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు వాపసు చేస్తామని ప్రకటించింది.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!