పీఎఫ్ ఖాతాదారులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ అందించింది. పీఎఫ్ డబ్బులను ఈజీగా విత్ డ్రా చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోది. త్వరలోనే యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే సిస్టమ్ ను మూడు నెలల్లో తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బులను యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ డబ్బులను బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయడం ద్వారా విత్ డ్రా చేసుకునేవారు. ఈ విధానంలో డబ్బులు పొందడానికి కాస్త టైమ్ పడుతుంది.
రాబోయే 2-3 నెలల్లో UPI ప్లాట్‌ఫామ్‌లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించడానికి EPFO ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో చర్చలు జరుపుతోందని కూడా నివేదికలు వెల్లడిస్తున్నాయి. UPIతో EPFO అనుసంధానం కార్యకలాపాలను మెరుగుపరచడమే కాకుండా 7 కోట్లకు పైగా EPFO సభ్యులకు నిధుల బదిలీ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈపీఎఫ్ ని యూపీఐతో అనుసంధానించడం ద్వారా క్లెయిమ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రాన్సాక్షన్స్ సులభతరం చేయడం ప్రభుత్వ లక్ష్యం.
Also Read:Hyundai Creta : హ్యుందాయ్ క్రెటా కొనాలని చూస్తున్నారా.. మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే
పీఎఫ్ ఖాతాదారులు అనుసంధానం చేసుకున్న తరువాత డిజిటల్ వాలెట్ ద్వారా క్లెయిమ్ మొత్తాన్ని ఈజీగా పొందొచ్చు. కార్మిక మంత్రత్వ శాఖ.. ఆర్బీఐ, వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్ఓ డిజిటల్ వ్యవస్థను అప్ గ్రేడ్ చేస్తోంది. దీనివల్ల డబ్బుల ఉపసంహరణ ప్రక్రియ సులభతరం అవుతుంది. కాగా ఇటీవల ఈపీఎఫ్ఓ ఏటీఎం నుంచి పీఎఫ్ మొత్తాన్ని తీసుకునే సౌకర్యాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో, EPFO రూ. 1.82 లక్షల కోట్ల విలువైన 44.5 మిలియన్ క్లెయిమ్‌లను పరిష్కరించింది.