Elon Musk Twitter Deal: ముదురుతున్న వివాదం.. ట్విట్టర్ పై మస్క్ కౌంటర్ దావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్లా అధినేత , ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పై ఎదురుదాడికి దిగారు. మస్క్, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మధ్య లీగల్ వార్ మరింత ముదురుతోంది. అయితే.. ట్విట్టర్ తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి టెస్లా అధినేతపై దావా వేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. తాజాగా ట్విట్టర్ దావాను సవాల్ చేస్తూ మస్క్ కూడా కౌంటర్ దావా వేశారు. మస్క్ పై ట్విట్టర్ వేసిన దావాపై ఈ ఏడాది అక్టోబరులో విచారణ జరపనున్నట్లు డెలావర్ కోర్టు ఆదేశాలు వెలువరించిన కొద్ది గంటలకే మస్క్ ఎదురు దాడికి దిగాడు. మస్క్ కూడా సవాల్ చేస్తూ ట్విట్టర్ పై దావా వేయడం చర్చనీయాంశంగా మారింది.
read also: Thirty Five Years for Bala Krishna Ramu Movie : బాలకృష్ణ ‘రాము’కు 35 ఏళ్ళు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3.50 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. నకిలీ ఖాతాల సంఖ్యకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ వెల్లడించారు. దీంతో.. ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. మస్క్ షరతులకు లోబడి ఒప్పందాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డెలావర్‌లోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈనేపథ్యంలో.. ఒప్పందంలో అంగీకరించినట్లుగా ఒక్కో షేరును 54.20 డాలర్ల వద్ద కొనుగోలు చేసేలా ఆదేశించాలని కోరింది. దీంతో.. ఈ పిటిషన్‌ను నిన్న స్వీకరించిన డెలావర్ కోర్టు.. అక్టోబరు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు దీనిపై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. అయితే.. మస్క్ సామాజిక మాధ్యమంపై కౌంటర్ దావా వేసిన.. మస్క్ వేసిన దావాపై ట్విట్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ట్విట్టర్ షేరు విలువ 41.61 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. అయితే.. మస్క్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ట్విట్టర్ షేర్లు భారీగా పతనమయ్యాయని.. అయితే షేర్లు మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?