బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కొనుగోలుకు 44 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన.. ఇప్పుడు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు.. సోషల్ మీడియా సంస్థ ప్లాట్‌ఫారమ్‌లో నకిలీ ఖాతాల గురించి సమాచారాన్ని అందించడంలో విఫలమైందని అందుకే ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి తన 44 బిలియన్ డాలర్ల బిడ్‌ను ఉపసంహరించుకున్నట్టు ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. అయితే, టెస్లా చీఫ్‌పై న్యాయపోరాటానికి సిద్ధం అవుతోంది ట్విట్టర్.. విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి బోర్డు చట్టపరమైన చర్యలను కొనసాగించాలని యోచిస్తోందని ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్ పేర్కొన్నారు..
Read Also: Red Alert: హైదరాబాద్‌కు రెడ్ అలెర్ట్ జారీ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
అయితే, మస్క్ యొక్క న్యాయవాదులు ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లోని నకిలీ లేదా స్పామ్ ఖాతాల సమాచారం కోసం బహుళ అభ్యర్థనలకు ప్రతిస్పందించడంలో విఫలమైందని తెలిపారు, ఇది కంపెనీ వ్యాపార పనితీరుకు ప్రాథమికమైనదని.. ట్విట్టర్ ఆ ఒప్పందంలోని బహుళ నిబంధనలను ఉల్లంఘించిందని.. విలీన ఒప్పందంలోకి ప్రవేశించేటప్పుడు మస్క్ ఆధారం చేసుకున్న తప్పుడు మరియు తప్పుదారి పట్టించే ప్రాతినిధ్యాలు చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. కాగా, కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్ ముందుకు వెళ్లదని గత కొంత కాలంగా ఎలన్ చెబుతూ వస్తున్నారు. ట్విట్టర్ చెప్పిన దానికంటే స్పామ్ ఖాతాలు నాలుగింతలు అధికంగా ఉన్నాయనేది వారి వాదనగా ఉంది.. స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారం కచ్చితమైనదని భావించే తాను కొనుగోలు ఒప్పందానికి అంగీకరించానని.. దానిపై క్లారిటీ వచ్చేవరకు ఒప్పందం ముందు వెళ్లదని పలుమార్లు స్పష్టం చేశారు ఎలన్ మస్క్.
ఇక, ఎలన్ ఎంట్రీ తర్వాత ఆ సంస్థలు కీలక మార్పులు చోటు చేసుకుంటాయనే ప్రచారం ముందు నుంచే సాగుతూ వచ్చింది.. వాటికి అనుగుణంగా ట్విట్టర్‌లోని టాలెంట్ అక్విజేషన్ టీంకు చెందిన 30 శాతం మంది ఉద్యోగుల్నిపక్కన పెట్టింది ఆ సంస్థ.. మరో 100 మంది ఉద్యోగులను తొలగించింది.. ఇందులో ప్రధానంగా రిక్రూటర్లు, కొత్త ఉద్యోగులను బోర్డులోకి తీసుకురావడానికి బాధ్యత వహించే వ్యక్తులే ఉన్నారు. అయితే, ఎలన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ ప్రకటించినప్పటి నుంచి ఆ సంస్థ ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది.. మస్క్ సూచనలతో ఖర్చులను తగ్గించుకోవడానికి నియామకాలను కూడా నిలిపివేసింది ట్విట్టర్, జూన్ మాసంలో ట్విట్టర్ ఉద్యోగులతో తొలి సమావేశం నిర్వహించిన మస్క్‌కు ఉద్యోగుల తొలగింపు ఉంటుందా? అనే ప్రశ్న ఎదురైంది.. దానికి సమాధానమిచ్చిన ఆయన.. సంస్థ ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందిని వ్యాఖ్యానించారు.. అదే సమయంలో ఖర్చును సైతం తగ్గించుకోవాలని సూచించారు.. అందులో భాగంగానే ట్విట్టర్‌లో మార్పులు చేసుకున్నాయి కూడా.. అయితే, ఇప్పుడు ఎలన్ మస్క్ ఈ ఒప్పందం నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.